Monday, 05 January 2026 04:30:00 PM
# అంతా పక్కాగా మేనేజ్ చేసిన నకిలీ ఐఏఎస్! ఒకే ఒక మిస్టేక్‌తో.. # మక్తల్.. వాహనం ఢీకొని యువకుడి మృతి..! # ఆమెకు 28.. అతనికి 23.. ఇద్దరూ కలిసి చున్నీతో చంపేశారు.. # మావోయిస్ట్‌ పార్టీకి బిగ్‌షాక్.. లొంగుబాటుకు సద్దమైన హిడ్మా క్లోజ్ ఫ్రెండ్! # ప్రాణం తీసిన చిట్టి వ్యాపారం.. డబ్బులు అడిగినందుకు కొట్టి చంపిన తండ్రి, కొడుకులు..! # నర్సింగ్ విద్యార్థినిపై డాక్టర్ అత్యాచారం.. # రోడ్డు ప్రమాదాలకు కారణాలు ఇవే: నారాయణపేట్ ఎస్పీ # క్లీనెస్ట్ సిటీ.. కలుషిత నీటితో 10 మంది మృతి # మైనర్ బాలికను చిదిమేసిన నరరూప రాక్షసులు.. ఏడాదిన్నర తరువాత వెలుగులోకి..! # నిరుద్యోగులకు న్యూయర్ కానుక.. త్వరలోనే 14వేల కానిస్టేబుల్‌ పోస్టులకు నోటిఫికేషన్! # డిగ్రీ విద్యార్థిని చితకబాదిన వార్డెన్‌పై సస్పెన్షన్‌ వేటు.. # మరో బస్సు ప్రమాదం.. స్పాట్‌లో నలుగురు మృతి, 10 మందికి గాయాలు # ఒక పెళ్లి.. 3 సూసైడ్స్..! సినిమాను మించి ట్విస్టులు # ఎర్నాకులం ఎక్స్ ప్రెస్‌ రైలులో మంటలు.. 2 బోగీలు పూర్తిగా దగ్ధం # విభాగ్ స్థాయి ఖేల్ కూద్ లో ప్రతిభ కనబరచిన శ్రీ సరస్వతి శిశు మందిర్ ఊట్కూర్ విద్యార్థులు # ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు మృతి.. # పోలీసులకు సవాల్‌గా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ బత్తుల ప్రభాకర్ # ఘోర బస్సు ప్రమాదం.. 20 మంది సజీవ దహనం # ఖాకీ ముసుగులో కామాంధుడు.. ఏకంగా ఇన్‌స్పెక్టర్ ఇంట్లోనే.. # కొత్త సర్పంచ్‌లకు సీఎం గుడ్ న్యూస్..

మైనర్ బాలికను చిదిమేసిన నరరూప రాక్షసులు.. ఏడాదిన్నర తరువాత వెలుగులోకి..!

Date : 31 December 2025 06:16 PM Views : 37

Abhi9 News - క్రైమ్ వార్తలు / ప్రకాశం ( ఒంగోలు ) : ఎంత దారుణం.. నమ్మకంగా తీసుకొచ్చి సామూహికంగా లైంగిక దాడికి పాల్పడి, అంతటితో వదిలేయక, గొంతు నులిమి చంపేశారు. 14 ఏళ్ళ మైనర్ బాలికను చంపేసిన నరరూప రాక్షసుల ఉదంతం ఏడాదిన్నర తరువాత వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటన ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం దొడ్డవరప్పాడు శివారులోని రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌లో చోటు చేసుకుంది. కుళ్లిపోయిన స్థితిలో బాలిక మృతదేహాన్ని గుర్తించిన పోలీసులకు తొలుత ఎలాంటి క్లూ లభించకపోవడంతో దాదాపు దర్యాప్తు వదిలేశారు. అయితే ఆ తరువాత కొత్తగా వచ్చిన జిల్లా ఎస్‌‌పీ హర్షవర్ధన్‌ రాజు సీరియస్‌ ఎఫర్ట్‌తో ఏడాదిన్నర తరువాత ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. శింగరాయకొండకు చెందిన 14 ఏళ్ళ బాలికను సామూహిక లైంగిక దాడికి పాల్పడి, దారుణంగా చంపేసినట్టు తేలడంతో ఈ ఘాతుకానికి ఒడగట్టిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేసి కటకటాల వెనక్కి నెట్టారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం దొడ్డవరప్పాడులో 2024 జూన్‌ 23న గుర్తుపట్టలేని విధంగా లభించిన బాలిక మృతదేహం మిస్టరీని పోలీసులు ఛేధించారు. ఏడాదిన్నర క్రితం శరీరం పూర్తిగా కుళ్ళిపోయిన బాలిక మృతదేహం లభించించింది. మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. అనంతరం పోస్టుమార్టం రిపోర్ట్‌లో బాలికను గొంతు నులిమి హత్య చేసినట్టు తేలింది. అయితే ఈ కేసులో ఎలాంటి లీడ్‌ లభించక అప్పటి పోలీసులు కేసును దాదాపుగా వదిలేశారు. అయితే ఇటీవల ప్రకాశం జిల్లా ఎస్‌పీగా బాధ్యతలు స్వీకరించిన హర్షవర్ధన్‌ రాజు ఈ కేసుపై సీరియస్‌గా దృష్టిపెట్టారు. ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఒంగోలు రూరల్‌ పోలీస్ బృందంతో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఈ కేసును ఛాలెంజింగ్‌గా తీసుకున్నారు. జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్లలో ఆ సమయంలో యువతుల మిస్సింగ్‌ కేసులపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలో సింగరాయకొండకు చెందిన 14 ఏళ్ళ బాలిక లాహిరి కనిపించడం లేదని సింగరాయకొండ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్‌ కేసు నమోదైనట్టు గుర్తించారు.మిస్సింగ్ కేసు ఆధారంగా అదృశ్యమైన లాహిరి తల్లి తిరుపతమ్మను విచారించారు పోలీసులు. ఈ క్రమంలో అప్పటి బాలిక మృతదేహం ఫోటోలను ఆమె గుర్తించడంతో ఫోరెన్సిక్‌ నిపుణుల ఆధారంగా మరిన్ని వివరాలు సేకరించారు. బాలికతో సన్నిహితంగా మెలిగిన కొంత మందిని విచారించిన క్రమంలో ఓ ముగ్గురు యువకుల గురించి సమాచారం తెలుసుకున్నారు. బాలిక చనిపోయిన నాటి నుంచి ఆ ముగ్గురు సింగరాయకొండ నుంచి పారిపోయారు. వారు వివిధ ప్రాంతాల్లో తలదాచుకున్నట్టు గుర్తించి వారిని పట్టుకొచ్చారు సిఐ శ్రీకాంత్‌. పోలీసులు తమదైన స్టైల్‌లో విచారణ జరపడంతో 14 ఏళ్ల లాహిరిని తామే చిదిమేసినట్లు ఒప్పుకున్నారు. మాయమాటలు చెప్పి లాహిరిని శింగరాయకొండ నుంచి మద్దిపాడు మండలం దొడ్డవరప్పాడు దగ్గర ఉన్న ఓ రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌ దగ్గరకు తీసుకొచ్చారు. అనంతం ముగ్గురు కలిసి సామూహికంగా అఘాయిత్యానికి ఒడిగట్టు ఒప్పుకున్నట్టు పోలీసులు తెలిపారు. నిందితులు 26 ఏళ్ళ దుద్దెల చెన్న కృష్ణ, 26 ఏళ్ళ దేవరాజు వంశీ, 28 ఏళ్ళ డబ్బుకొట్టు కోటయ్యలుగా గుర్తించారు. జరిగిన దారుణం ఎవరికైనా చెబుతుందన్న భయంతో గొంతు నులిమి ఆమెను చంపేసినట్టు తెలిపడంతో ఈ ముగ్గురిని అరెస్ట్‌ చేశామని జిల్లా ఎస్‌పీ హర్షవర్ధన్‌ రాజు తెలిపారు. బాలికపై గ్యాంప్‌ రేప్‌ అండ్‌ మర్దర్‌ కేసును ఎంతో చాకచక్యంగా వ్యవహరించి ఛేదించారు పోలీసులు. తొలుత ఎలాంటి క్లూ లభించకపోయినా సుదీర్ఘంగా విచారణ చేసి ఏడాదిన్నర తరువాత ఒంగోలు రూరల్‌ పోలీసులు కేసును ఛేధించారు. సీఐ శ్రీకాంత్ బృందాన్ని జిల్లా ఎస్‌పి హర్షవర్ధన్‌రాజు ప్రత్యేకంగా అభినందించారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :