Saturday, 18 April 2026 05:10:11 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

ఆమెకు 28.. అతనికి 23.. ఇద్దరూ కలిసి చున్నీతో చంపేశారు..

అక్రమ సంబంధాలు ప్రాణాలు తీస్తూ.. కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి.. తాజాగా.. అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి భార్య.. భర్తను హత్

Date : 03 January 2026 05:18 PM Views : 179

Abhi9 News - క్రైమ్ వార్తలు / మెదక్ : అక్రమ సంబంధాలు ప్రాణాలు తీస్తున్నాయి.. తాజాగా.. తన అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని భార్య ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది.. ఈ ఘటన తెలంగాణ మెదక్‌ జిల్లా శివంపేట మండలం తిమ్మాపూర్‌లో జరిగింది. మద్యం మత్తులో ఉన్న భర్త స్వామి (35) ని చంపి.. చెరువులో పడి చనిపోయినట్టుగా నమ్మించేందుకు ప్రయత్నం చేసి.. అడ్డంగా దొరికింది.. విచారణలో భార్య మౌనిక అక్రమ సంబంధం బాగోతం బయటపడంతోపాటు.. స్కెచ్ వేసి చంపినట్లు పోలీసులు తెలిపారు. డిసెంబర్ 23న నేరెళ్ల కుంటలో పడి బొల్లెబోయిన స్వామి మృతి చెందాడు.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పలు కోణాల్లో విచారించి.. అతన్ని చంపింది.. భార్య మౌనిక, ఆమె ప్రియుడు సంపత్ గా తేల్చారు. వివరాల ప్రకారం.. 12 ఏళ్ల క్రితం స్వామి, మౌనికలకు పెళ్లి జరగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే.. మౌనిక (28) తనకంటే.. తక్కువ వయస్సున్న తిమ్మాపూర్‌ సంపత్ (23) తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. తిమ్మాపూర్‌ సంపత్‌తో మౌనికకు అక్రమ సంబంధం భర్త స్వామికి తెలిసింది. దీంతో స్వామి భార్యతో గొడవపడ్డాడు.. దీనిపై పంచాయితీ పెడతానన్న భర్త స్వామి మౌనికకు చెప్పాడు.. ఈ క్రమంలోనే.. డిసెంబర్‌ 22న తాగి వచ్చి గొడవ చేశాడు.. అతడు నిద్రపోయిన తర్వాత ప్రియుడు సంపత్‌ను ఇంటికి పిలిచిన మౌనిక.. స్వామిపై దాడి చేసింది.. ఇద్దరూ కలిసి గొంతుకు చున్నీని బిగించి హత్య చేశారు.. అనంతరం మౌనిక సంపత్.. బైక్‌పై మృతదేహాన్ని తీసుకెళ్లి.. నేరెళ్లకుంటలో పడేశారు.. ఆ తర్వాత.. మద్యం మత్తులో భర్త స్వామి చెరువులో పడి చనిపోయినట్టు మౌనిక నమ్మించింది.. తర్వాత మౌనిక, సంపత్‌ విషయం తెలిసి.. పోలీసులు అనుమానంతో అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. అన్ని విషయాలు బయటపడ్డాయి. తామే చంపినట్లు మౌనిక, సంపత్ ఒప్పుకున్నారు.. దీంతో మౌనిక, ఆమె ప్రియుడు సంపత్ ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :