Saturday, 18 April 2026 05:16:04 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

పోలీసులకు సవాల్‌గా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ బత్తుల ప్రభాకర్

ఏపీ, తెలంగాణ పోలీసులకు చాలెంజ్‌గా మారిన మోస్ట్‌ వాంటెడ్‌ నిందితుడు బత్తుల ప్రభాకర్‌.. ఇప్పుడు తమిళనాడు పోలీసులకు కూడా సవాల్‌ విసిరాడు. ఫలితంగా.. చోరీల

Date : 25 December 2025 09:25 AM Views : 199

Abhi9 News - క్రైమ్ వార్తలు / : మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ మరోసారి హాట్‌టాపిక్‌గా మారాడు. ఈ సారి కూడా ఓ కాలేజ్‌లో చోరీ చేసి.. తమిళనాడు పోలీసులకు సవాల్‌ విసిరాడు. దీంతో.. మూడు రాష్ట్రాల పోలీసులు రంగంలోకి దిగారు. ఇటీవల చెన్నైలోని ఓ కాలేజ్‌లో జరిగిన డబ్బుల చోరీ కేసులో బత్తుల ప్రభాకర్ పాత్ర ఉన్నట్లు తమిళనాడు పోలీసులు గుర్తించారు. నాలుగు రోజుల క్రితం కళాశాలలో చోరీకి సంబంధించిన దృశ్యాల్లో బత్తుల ప్రభాకర్‌ ఐడెంటీఫై అయ్యాడు. దాదాపు 80 వరకు చోరీల్లో పాత్ర ఉన్నట్లు భావిస్తున్న.. హైదరాబాద్‌లో ప్రిజం పబ్ వద్ద పట్టుకోడానికి వెళ్తే.. ఏకంగా పోలీసులపైనే కాల్పులు జరిపాడు. స్థానికులు సాయంతో పలు కేసుల్లో నిందితుడుగా ఉన్న బత్తుల ప్రభాకర్‌ను ఆ రోజు హైదరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత విజయవాడలోని ఓ ఇంజినీరింగ్ కాలేజ్‌లోనూ చోరీ చేసి పరారైన ఘటనలో నిందితుడిగా ఉండడంతో ఏపీ పోలీసులు పీటీ వారెంట్‌పై విజయవాడకు తరలించారు. గత సెప్టెంబర్‌లో విజయవాడ కోర్టు నందు హాజరు పరిచి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తుండగా ఎస్కార్ట్ సిబ్బందిని మాయ చేసి బత్తుల ప్రభాకర్‌ పరావడం కలకలం సృష్టించింది. అప్పటినుంచి రెండు నెలలుగా విజయవాడ సీసీఎస్ పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పుడు సడెన్‌గా చెన్నైలోని ఓ కాలేజ్‌లో 45 లక్షల చోరీ కేసు దర్యాప్తుతో నిందితుడు పాత నేరస్థుడైన బత్తుల ప్రభాకర్‌ను తమిళనాడు పోలీసులు గుర్తించి తెలుగు రాష్ట్రాల పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో.. విజయవాడ సీసీఎస్ పోలీసులు చెన్నైకి వెళ్లారు. మొత్తంగా.. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక, కేరళ పోలీసులకు బత్తుల ప్రభాకర్‌ వ్యవహారం సవాలుగా మారింది. సౌత్‌లో మొత్తం 80 కేసుల్లో బత్తుల ప్రభాకర్‌ మోస్ట్‌ వాంటెడ్‌ నిందితుడు కావడంతో ఈ సారి స్పెషల్‌ ఫోకస్‌ పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఇతగాడు వారంలో తొలి 3 రోజులు ప్లానింగ్ చేసి.. గురువారం మాత్రమే చోరీలకు పాల్పడతాడని పోలీసులకు సమాచారం ఉంది. ప్రముఖ కాలేజీలు, విద్యా సంస్థల్లో అతని ప్రధాన టార్గెట్. చిత్తూరు జిల్లాకు చెందిన బత్తుల ప్రభాకర్‌ లైఫ్ స్టైల్ కూడా చాలా లగ్జీరీగా ఉంటుంది. బ్రాడెండ్ దుస్తులు వేసుకుంటాడు. ప్రియయం మందు తాగుతాడు. ఫిట్ నెస్ కోసం నిత్యం కసరత్తులు చేస్తాడు. ఖరీదైన కార్లలో తిరుగుతూ.. పబ్బుల్లో, అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తుంటాడు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :