Abhi9 News - క్రైమ్ వార్తలు / : ఉత్తప్రదేశ్‌లోని కాన్పూర్‌లోని ఒక ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. నర్సింగ్ విద్యార్థినిని ఓ డాక్టర్ పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి పలుమార్లు అత్యాచారం చేయడమే కాదు.. ఏకాంత సమయాన్ని ఫోటోలు, వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పపడ్డాడు. వైద్య విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పపడిన ఆ వైద్యుడిపై ప్రస్తుతం కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రస్తుతం.. అతడు పరారీలో ఉన్నాడని, పట్టుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు కొనసాగుతున్నాయని డీసీపీ విశ్వజిత్ శ్రీవాస్తవ తెలిపారు. నర్సింగ్ విద్యార్థిని వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్ ముందు నమోదు చేస్తామన్నారు. బాధితురాలు ప్రైవేట్ మెడికల్ కాలేజీలో నర్సింగ్ చేస్తోంది. నిందితుడైన డాక్టర్, సదరు విద్యార్థినిని తన గదిలోకి పిలిచి వివాహం చేసుకుంటానని చెప్పి పలుమార్లు లైంగిక దాడికి పాల్పపడినట్లు నర్సింగ్ విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కియాసెర్‌బాగ్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఇటీవల తనను వివాహం చేసుకోవాలని ఆ వైద్యుణ్ని కోరగా.. అతడు నిరాకరించడమే కాకుండా తన ప్రైవేట్ ఫోటోలను సోషల్ మీడియాలో లీక్ చేస్తానని బెదిరింపులకు పాల్పపడ్డాడని ఫిర్యాదులో పేర్కొంది. ఈ కేసులో సీఎం యోగి ఆదిత్యానాథ్ బాధితురాలితో మాట్లాడినట్లు సమాచారం.
Admin
Abhi9 News