Saturday, 18 April 2026 06:50:51 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

విద్యార్థినిపై అసిస్టెంట్ ప్రొఫెసర్ అత్యాచారం.. మరొకరు వీడియో తీసి..

విద్యాబుద్ధులు నేర్పాల్సిన విశ్వవిద్యాలయంలో కీచక పర్వం వెలుగుచూసింది. విద్యార్థినిపై.. అద్యాపకులు లైంగిక దాడికి పాల్పడిన దారుణ ఘటన తిరుపతి సంస్కృత విశ

Date : 07 December 2025 05:35 PM Views : 166

Abhi9 News - క్రైమ్ వార్తలు / : కన్నబిడ్డల్లా చూడాల్సిన విద్యార్ధులను కొందరు ఉపాధ్యాయులు కామంతో చూస్తున్నారు. మాయమాటలు చెప్పి లోబరచుకుని వారి జీవితాలనే నాశనం చేస్తున్నారు. తిరుపతిలో అలాంటి ఘటనే జరిగింది. తిరుపతి నేషనల్‌ సంస్కృత యూనివర్సిటీలో చదువు చెప్పే అసిస్టెంట్ ప్రొఫెసర్ కామాంధుడిగా మారాడు. విద్యార్థిని లైంగికంగా వేధించి ఆమె జీవితాన్ని నాశనం చేశాడు. తిరుపతి నేషనల్‌ సంస్కృత యూనివర్సిటీలో ఒడిశాకు చెందిన యువతి బీఎడ్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఆ యువతిపై అసిస్టెంట్ ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్ కన్ను వేశాడు. ఆమెను లైంగికంగా వేధింపులకు గురి చేశాడు. శారీరక సంబంధం పెట్టుకుని గర్భవతిని చేశాడు. లక్ష్మణ్ కుమార్ లైంగిక దాడికి పాల్పడగా.. ఆ దృశ్యాలను మరో అసిస్టెంట్ ప్రొఫెసర్ శేఖర్ రెడ్డి మొబైల్ ఫోన్లో చిత్రీకరించాడు. ఆ తర్వాత ఇద్దరూ ఆ విద్యార్థినిని బ్లాక్ మెయిల్ చేయగా.. వేధింపులు తాళలేక బాధిత విద్యార్థిని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌ GSR కృష్ణమూర్తికి ఫిర్యాదు చేసింది. విషయం వెలుగులోకి రావడంతో విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. దీంతో ఇన్‌ఛార్జ్ రిజిస్ట్రార్ రజనీకాంత్ శుక్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు FIR నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్ల సెల్‌ఫోన్లను సీజ్ చేశారు పోలీసులు. ఈ ఘటన జరిగిన తర్వాత బాధితురాలు ఒడిషాకు వెళ్లిపోయింది. మరోవైపు విద్యార్థినిపై లైంగిక దాడి ఆరోపణలపై అంతర్గత విచారణ జరిపేందుకు యూనివర్సిటీ అంతర్గత ఫిర్యాదుల కమిటీ ని నియమించినట్లు తెలుస్తోంది.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :