Saturday, 18 April 2026 06:40:09 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ఇద్దరు మృతి

Date : 16 November 2025 07:46 AM Views : 201

Abhi9 News - క్రైమ్ వార్తలు / జనగాం : వరంగల్-హైదరాబాద్ మధ్య జాతీయ రహదారి NH 163 పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారిపై ఆగిఉన్న ఇసుక లారీని ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు వెనుక నుండి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో ఆరుగురు తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు.. ఇద్దరు డ్రైవర్ల నిర్లక్ష్యం ఈ ప్రమాదానికి కారణంగా గుర్తించిన పోలీసులు లారీ డ్రైవర్ తో పాటు బస్సు డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. జాతీయ రహదారిపై అజాగ్రత్తగా లారీ డ్రైవర్ ఇసుక లారీ పార్కింగ్ చేశాడు. ఆర్టీసీ డ్రైవర్ ఆ లారీని గమనించకుండా వెనుక నుంచి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు నిండు ప్రాణాలు కోల్పోగా ఆరుగురు తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. వరంగల్ – హైదరాబాద్ జాతీయ రహదారిపై జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడికొండ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.. మరో ఆరుగురు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదం ఆదివారం తెల్లవారుజామున జరిగింది.. TG07UK5469 నెంబర్ గల ఇసుక లారీని డ్రైవర్ నిర్లక్ష్యంగా జాతీయ రహదారిపై నిలిపాడు. ఈ మార్గంలో హనుమకొండ నుండి హైద్రాబాద్ వెళ్తున్న TG03Z0046 నెంబర్ గల సూపర్ లెగ్జరీ రాజధాని బస్సు వెనుకనుండి డీ కొట్టింది. ఈ క్రమంలో బస్సు ఎడమ వైపు భాగం నుజ్జునుజ్జయింది.. బస్సులో ఎడమ వైపు కూర్చున్న ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు.. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.. మృతులు దిండిగల్ కు చేసిన పులమాటి ఓం ప్రకాష్( 75 ) గా గుర్తించారు.. మరొకరు హనుమకొండలోని బాలసముద్రం ప్రాంతానికి చెందిన నవదీప్ సింగ్ గా గుర్తించారు.. ఆరుగురు క్షతగాత్రులను ఎంజీఎం హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బస్సు నిర్లక్ష్యం.. లారీ డ్రైవర్ అజాగ్రత్త ఈ ప్రమాదానికి కారణమని.. ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు.. ఇరు డ్రైవర్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :