Saturday, 18 April 2026 05:19:27 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

పోలీసులకు షాక్ ఇచ్చిన ఖైదీ.. ఆగి ఉన్న జీప్ నుంచి జంప్..

ఓ ఖైదీ పోలీసులకు ఊహించని షాక్ ఇచ్చాడు. పోలీస్ జీప్ నుంచి ఎంతో చాకచక్యంగా తప్పించుకున్నాడు. పోలీసులకు దొరకకుండా పారిపోయాడు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధిం

Date : 20 December 2025 09:00 AM Views : 176

Abhi9 News - క్రైమ్ వార్తలు / : పోలీస్ జీప్ నుంచి ఖైదీలు తప్పించుకునే సీన్స్ చాలా సినిమాల్లో చూసే ఉంటారు. నిజ జీవితంలో ఇలాంటి సంఘటనలు అత్యంత అరుదుగా జరుగుతూ ఉంటాయి. తాజాగా, ఓ ఖైదీ పోలీసులకు ఊహించని షాక్ ఇచ్చాడు. పోలీస్ జీప్ నుంచి ఎంతో చాకచక్యంగా తప్పించుకున్నాడు. పోలీసులకు దొరకకుండా పారిపోయాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. హోషంగాబాద్‌కు చెందిన ఓ యువకుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. జీప్‌లో అతడ్ని ఓ చోటు నుంచి మరో చోటుకు తీసుకుని వెళుతూ ఉన్నారు. కారు హోషంగాబాద్ అవుట్ స్కట్స్‌లో రోడ్డు పక్క ఆగింది. పోలీసులు బయట నిలబడి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇదే అదునుగా భావించిన ఆ యువకుడు ఠక్కున జీప్ డోరు తెరిచి అక్కడినుంచి పరుగులు పెట్టాడు. ఇది గమనించిన పోలీసులు అతడ్ని వెంబడించారు. అతడు జెట్ స్పీడుతో అక్కడినుంచి పరుగులు పెట్టసాగాడు. యువకుడిని పట్టుకోవటం పోలీసుల వల్ల కాలేదు. ఓ పోలీస్ రోడ్డు పక్క కిందపడిపోయాడు. మిగిలిన పోలీసులు అతడ్ని వెంబడించారు. ఎంత ప్రయత్నించినా అతడ్ని పట్టుకోవటం వారి వల్ల కాలేదు. యువకుడు వారికి దొరకకుండా తప్పించుకున్నాడు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. యువకుడు పోలీసుల నుంచి తప్పించుకున్న దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి. ఇక, వైరల్‌గా మారిన వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘పోలీసులు ఎంత ఫిట్‌గా ఉన్నారో ఈ వీడియో చూస్తే అర్థం అవుతుంది. ఓ పోలీస్ రోడ్డు పక్క బొక్కబోర్లా పడిపోయాడు. అందరూ కలిసినా అతడ్ని పట్టుకోలేకపోయారు’..‘మరీ అంత ఈజీగా అతడు ఎలా తప్పించుకున్నాడు. పోలీసులు అతడి దరిదాపుల్లోకి కూడా వెళ్లలేకపోయారు’..‘నిజంగా ఆ యువకుడు ప్లాస్ మ్యాన్ తమ్ముడిలా ఉన్నాడు. అందుకే అంత ఈజీగా పోలీసుల నుంచి తప్పించుకున్నాడు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :