Saturday, 18 April 2026 06:47:51 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

హైదరాబాద్‌లో కాల్పుల కలకలం.. గన్‌తో ఏపీ మాజీ డిప్యూటీ సీఎం తమ్ముడు..

మణికొండ పంచవటి కాలనీలో కాల్పుల మోత మోగింది. స్థల వివాదంలో ఏపీ మాజీ డిప్యూటీ సీఎం సోదరుడు గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరపడంతో స్థానికులు భయాందోళన చె

Date : 04 November 2025 07:45 PM Views : 210

Abhi9 News - క్రైమ్ వార్తలు / Hyderabad : హైదరాబాద్‌లో కాల్పుల కలకలం రేగింది. మణికొండ పంచవటి కాలనీలో ఓ స్థల వివాదానికి సంబంధించి ఏపీ మాజీ డిప్యూటీ సీఎం సోదరుడు గాల్లోకి కాల్పులు జరపడం స్థానికంగా తీవ్ర భయాందోళనలకు గురి చేసింది. పంచవటి కాలనీలో ఉన్న తమ స్థలాన్ని ఖాళీ చేయాలంటూ ఏపీ మాజీ డిప్యూటీ సీఎం కృష్ణమూర్తి తమ్ముడు ప్రభాకర్‌ బెదిరింపులకు పాల్పడినట్లు బాధితులు ఆరోపించారు. ఖాళీ చేస్తారా..? లేదా అంటూ ప్రభాకర్ తన గన్‌తో గాల్లోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపినట్లు సమాచారం. ఈ కాల్పుల శబ్దం కాలనీవాసులను ఉలిక్కిపడేలా చేసింది. ఆ తర్వాత ప్రభాకర్ అనుచరులు బాధితులను స్థలం నుంచి బలవంతంగా బయటకు గెంటేసి.. గేటుకు తాళాలు వేశారు. ప్రభాకర్ దౌర్జన్యంగా తమ స్థలాన్ని ఆక్రమించుకుంటున్నాడరని.. తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. ఈ క్రమంలో రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ప్రభాకర్‌పై బాధితులు ఫిర్యాదు చేశారు. తమ భూమిని లాక్కున్న ప్రభాకర్‌తో పాటు అతడి అనుచరులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు పలు సెక్షన్ల కింద ప్రభాకర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :