Saturday, 13 June 2026 04:57:34 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

మైనర్ బాలికకు దగ్గరయ్యాడు.. ఆపై సీక్రెట్ ఫోటోలు లాగాడు

మైనర్ బాలికతో ఇన్ స్టాలో పరిచయం పెంచుకున్నాడు.. ఆపై బాగా క్లోజ్ అయ్యి.. వ్యక్తిగత సమాచారం, వ్యక్తిగత ఫోటోలు పొందాడు.

Date : 12 November 2025 05:01 PM Views : 216

Abhi9 News - క్రైమ్ వార్తలు / Hyderabad : హైదరాబాద్‌లో ఒక విద్యార్థికి నాంపల్లి కోర్టు కఠిన తీర్పు వెలువరించింది. మైనర్ బాలికను సోషల్ మీడియా ద్వారా మోసం చేసి, ఆమె వ్యక్తిగత ఫోటోలు చూపిస్తూ బ్లాక్‌మెయిల్ చేసిన విద్యార్థి ఆశం ఆకాష్‌కు నాంపల్లి కోర్టు 25 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.10 వేలు జరిమానా విధించింది. లాలగూడా ప్రాంతానికి చెందిన ఒక మైనర్ బాలికను ఆకాష్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం చేసుకున్నాడు. ఆమెతో స్నేహం పెంచుకున్నాడు. ఆ తర్వాత నమ్మకం సంపాదించి వ్యక్తిగత విషయాలు తెలుసుకుని, వ్యక్తిగత ఫోటోలు పొందాడు. కొంతకాలం తర్వాత ఆ ఫోటోలను చూపిస్తూ బాలికను బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించాడు. ఆకాష్ తన వద్ద ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరించి, డబ్బు అడిగినట్లు పోలీసులకు సదరు బాలిక తెలిపింది. ఆ బెదిరింపులకు భయపడిన మైనర్ బాలిక కొంతకాలం మౌనంగా భరించింది. తరువాత డబ్బు అవసరమవడంతో సొంత ఇంట్లోనే దొంగతనాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది. బాధితురాలి ప్రవర్తనలో మార్పులు గమనించిన కుటుంబ సభ్యులు విచారించగా, ఈ షాకింగ్ విషయమంతా బయటపడింది. తనపై జరుగుతున్న వేధింపులు ఇక భరించలేనని, ఆకాష్ తన గౌరవాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నాడని మైనర్ బాలిక లాలగూడా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు తక్షణమే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆకాష్ మొబైల్‌ ఫోన్, సోషల్ మీడియా అకౌంట్లు సీజ్ చేసి పరిశీలించగా, అనేక వ్యక్తిగత ఫోటోలు, చాట్ రికార్డులు బయటపడ్డాయి. ఈ కేసులో సేకరించిన డిజిటల్ ఆధారాలు, సాక్ష్యాలు, ఫోరెన్సిక్ నివేదికల ఆధారంగా పోలీసులు చార్జ్‌షీట్ దాఖలు చేశారు. నాంపల్లి కోర్టులో కేసు విచారణ జరగగా, పోలీసులు సమర్పించిన ఆధారాలు నిందితుడి దోషి అని నిర్ధారించాయి. చివరికి న్యాయమూర్తి ఆశం ఆకాష్ దోషిగా తేల్చి, అతనికి 25 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధించారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :