Saturday, 13 June 2026 04:59:00 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

మిస్టరీగా మారిన ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య

తల్లితండ్రులను వదిలి భవిష్యత్తు కోసం ఆరాటపడుతున్న అనుకున్నది సాధించలేక అసువులు బాస్తున్నారు. ఉన్న ఊరుని వదిలి దూరంగా ఉన్న కాలేజీలకు వచ్చి చేరి, చిన్న,

Date : 01 November 2025 07:25 PM Views : 191

Abhi9 News - క్రైమ్ వార్తలు / Hyderabad : తల్లితండ్రులను వదిలి భవిష్యత్తు కోసం ఆరాటపడుతున్న అనుకున్నది సాధించలేక అసువులు బాస్తున్నారు. ఉన్న ఊరుని వదిలి దూరంగా ఉన్న కాలేజీలకు వచ్చి చేరి, చిన్న, చిన్న కారణాలకే కళాశాలలో ఆత్మహత్య చేసుకుంటున్నారు. అసలు వాళ్ళు ఎందుకు ఇలా ఆత్మహత్యలు చేసుకుంటున్నారో ఎవరికి అర్థం కావడం లేదు.. తాజాగా సంగారెడ్డి జిల్లా సుల్తాన్ పూర్ జేఎన్టీయూ(JNTU)లో ఇలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. విద్యార్థి ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సూర్యాపేట జిల్లా మోతె మండలం సిరికొండ గ్రామ పరిధిలోని ఓ తండాకు చెందిన మహేశ్ శుక్రవారం (అక్టోబర్ 31) మధ్యాహ్నం హాస్టల్ గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మూడు రోజులుగా కాలేజీకి వెళ్లకుండా రూమ్‌కే పరిమితమైన మహేశ్, ఇవాళ తోటి స్టూడెంట్స్ క్లాసులకు వెళ్లిన తర్వాత తలుపులు బిగించుకొని సూసైడ్ చేసుకున్నాడు. మధ్యాహ్నం రూంకు తిరిగి వచ్చిన తోటి విద్యార్థులు ఉరి వేసుకున్న మహేష్‌ను గమనించి యూనివర్సిటీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వాళ్లు వచ్చి మహేష్‌ను కిందికి దింపి సమీపంలోకి ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్లు ధ్రువీకరించారు. కాగా, మృతుడి గదిలో సూసైడ్ నోట్ దొరకడంతో యూనివర్సిటీ సిబ్బంది తీసుకున్నట్లు తెలిసింది. అయితే ఆ లేఖలో ఏం రాశాడు.. అనేది ఇప్పుడు అందరికీ పెద్ద ప్రశ్నగా మారింది. అసలు మహేష్ ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు అనే విషయం తెలియరాలేదు. జేఎన్టీయూహెచ్‌లో మూడో సంవత్సరం చదువుతున్న మహేష్ మృతి ప్రస్తుతం మిస్టరీగా మారింది. ఈ డెత్‌పై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది..!

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :