Thursday, 08 January 2026 03:10:08 AM
# పాలమూరు : తెలంగాణలో టాప్-5.. మనోళ్లే..! # అంతా పక్కాగా మేనేజ్ చేసిన నకిలీ ఐఏఎస్! ఒకే ఒక మిస్టేక్‌తో.. # మక్తల్.. వాహనం ఢీకొని యువకుడి మృతి..! # ఆమెకు 28.. అతనికి 23.. ఇద్దరూ కలిసి చున్నీతో చంపేశారు.. # మావోయిస్ట్‌ పార్టీకి బిగ్‌షాక్.. లొంగుబాటుకు సద్దమైన హిడ్మా క్లోజ్ ఫ్రెండ్! # ప్రాణం తీసిన చిట్టి వ్యాపారం.. డబ్బులు అడిగినందుకు కొట్టి చంపిన తండ్రి, కొడుకులు..! # నర్సింగ్ విద్యార్థినిపై డాక్టర్ అత్యాచారం.. # రోడ్డు ప్రమాదాలకు కారణాలు ఇవే: నారాయణపేట్ ఎస్పీ # క్లీనెస్ట్ సిటీ.. కలుషిత నీటితో 10 మంది మృతి # మైనర్ బాలికను చిదిమేసిన నరరూప రాక్షసులు.. ఏడాదిన్నర తరువాత వెలుగులోకి..! # నిరుద్యోగులకు న్యూయర్ కానుక.. త్వరలోనే 14వేల కానిస్టేబుల్‌ పోస్టులకు నోటిఫికేషన్! # డిగ్రీ విద్యార్థిని చితకబాదిన వార్డెన్‌పై సస్పెన్షన్‌ వేటు.. # మరో బస్సు ప్రమాదం.. స్పాట్‌లో నలుగురు మృతి, 10 మందికి గాయాలు # ఒక పెళ్లి.. 3 సూసైడ్స్..! సినిమాను మించి ట్విస్టులు # ఎర్నాకులం ఎక్స్ ప్రెస్‌ రైలులో మంటలు.. 2 బోగీలు పూర్తిగా దగ్ధం # విభాగ్ స్థాయి ఖేల్ కూద్ లో ప్రతిభ కనబరచిన శ్రీ సరస్వతి శిశు మందిర్ ఊట్కూర్ విద్యార్థులు # ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు మృతి.. # పోలీసులకు సవాల్‌గా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ బత్తుల ప్రభాకర్ # ఘోర బస్సు ప్రమాదం.. 20 మంది సజీవ దహనం # ఖాకీ ముసుగులో కామాంధుడు.. ఏకంగా ఇన్‌స్పెక్టర్ ఇంట్లోనే..

పింఛన్‌ డబ్బు కోసం తల్లిని హత్య

కన్న కొడుకే హంతకుడు! కొడుకులకు భారం కాకూడదని వచ్చే పించన్‌ డబ్బుతో జీవనం సాగిస్తుంది ఆ తల్లి. కానీ మద్యానికి బానిసైన పెద్ద కొడుకు తల్లి పెన్షన్ డబ్బుప

Date : 20 September 2025 08:48 PM Views : 77

Abhi9 News - క్రైమ్ వార్తలు / Hyderabad : ఆ తల్లికి ఇద్దరు కొడుకులు. ఇద్దరు కొడుకులకు పెళ్లిళ్లు చేయడంతో కోడళ్లు.. మనవసంతానంతో ఆమె కాలక్షేపం చేస్తుంది. కొడుకులకు భారం కాకూడదని వచ్చే పించన్‌ డబ్బుతో జీవనం సాగిస్తుంది. కానీ మద్యానికి బానిసైన పెద్ద కొడుకు తల్లి పెన్షన్ డబ్బుపై కన్నేశాడు. ఈ విషయమై పలుమార్లు తల్లితో గొడవ కూడా పడ్డాడు. ఈ క్రమంలో తాజాగా మరోమారు గొడవ పడటంతో మద్యం మత్తులో ఉన్న కొడుకు పించన్‌ డబ్బు కోసం కన్నతల్లిని దారుణంగా హత్య చేశాడు. ఈ షాకింగ్‌ ఘటన వికారాబాద్ జిల్లా పరిగి మండలం గడిసింగాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. వికారాబాద్ జిల్లా పరిగి మండలం గడిసింగాపూర్ గ్రామానికి చెందిన మిట్టకోడూరు మల్లమ్మ (57)కు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు అంజయ్య గత కొంతకాలంగా మద్యం బానిసై డబ్బు కోసం తల్లితో తరచూ గొడవపడేవాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి కూడా పింఛన్‌ డబ్బు కోసం తల్లి మల్లమ్మతో మరో మారు ఘర్షణ పడ్డాడు. ఈ గొడవ కాస్త చిరిగి.. చిరిగి.. తీవ్రరూపం దాల్చడంతో కోపంతో ఊగిపోయిన అంజయ్య కర్రతో తల్లిపై దాడి చేశాడు. ఆనక గొడుగు పొడిచాడు. దీంతో తీవ్ర రక్తస్రావమై రక్తపు మడులో మల్లమ్మ పడి మృతి చెందింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించానే. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడు అంజయ్యను అదుపులోకి తీసుకున్నారు. మల్లమ్మ చిన్నకొడుకు మైపాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడు అంజయ్యను అరెస్ట్ చేశారు. విచారణలో నిందితుడు నేరం అంగీకరించాడు. తల్లి పింఛన్‌ డబ్బు కోసమే ఈ హత్య చేసినట్లు తెలిపాడు. కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు పరిగి డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :