Saturday, 18 April 2026 06:45:16 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలిపై అత్యాచారం

ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై జీహెచ్ఏంసీ పారిశుద్ధ్య కార్మికురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడో కామాంధుడు. నిన్న (శుక్రవారం) తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన ఒకరోజు ఆ

Date : 01 November 2025 11:21 AM Views : 179

Abhi9 News - క్రైమ్ వార్తలు / Hyderabad : ఇటీవల కాలంలో మహిళలకు రక్షణ లేకుండాపోతోంది. ప్రతీరోజు ఏదో ఒక చోట మహిళలపై అత్యాచారాలు, హత్యా ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు కామాంధులకు బలవుతున్నారు. కొందరు అత్యాచారాలు చేస్తుంటే.. మరికొందరు నీచులు అత్యాచారం చేయడంతో పాటు మహిళలను దారుణంగా హత్యలు చేస్తున్నారు. అసలు మహిళలు ఒంటరిగా కనబడితే చాలు తమ కామవాంఛను తీర్చుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. పారిశుద్ధ్య కార్మికురాలిపై అత్యాచారం ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నగరంలోని బోరబండ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో దారుణం జరిగింది. ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై జీహెచ్ఏంసీ పారిశుద్ధ్య కార్మికురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడో కామాంధుడు. నిన్న (శుక్రవారం) తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన ఒకరోజు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రతీరోజు లాగే బాధితురాలు తన విధులను నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఉన్నట్టుండి ఓ వ్యక్తి ఆమెను బలవంతం చేశాడు. ఎర్రగడ్డ ఈఎస్ఐ ఆసుపత్రి సమీపంలోని ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై కార్మికురాలిపై రాజు అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ దారుణ ఘటనపై బాధిత మహిళ బోరబండ పోలీసులను ఆశ్రయించింది. వెంటనే కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు రాజును అదుపులోకి తీసుకున్నాడు. మద్యం మత్తులో రాజు.. పారిశుధ్య కార్మికురాలిపై అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. నిందితుడు మోడల్ కాలనీలో ఓ అపార్టెంట్‌లో వాచ్మెన్‌గా పని చేస్తున్నట్టు సమచారం.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :