Abhi9 News - క్రైమ్ వార్తలు / : శరీరంపై పచ్చబొట్టు (టాటూ) ఉండడంతో సైన్యంలో చేరేందుకు నిరాకరించబడిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మదురై తత్తనేరి అరుళ్దాస్పురం ప్రాంతానికి చెందిన బాలమురుగన్ కుమారుడు యోగసుధీష్ మదురైలోని ఓ ప్రైవేటు కళాశాలలో చదువుతున్నాడు. సైన్యంలో చేరాలనే ఆశయంతో సుధీష్ శిక్షణ పొందాడు. ఇటీవల, ఈరోడ్‌లో జరిగిన సైనిక శిబిరానికి హాజరయ్యాడు. అతడి చేతిపై పచ్చబొట్టు ఉండడాన్ని గమనించిన అధికారులు, అతడిని ఎంపిక చేయకుండా పంపించేశారు. దీని కారణంగా కొద్దిరోజులుగా సుధీష్ ఆవేదన చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై సెల్లూరు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.
Admin
Abhi9 News