Saturday, 18 April 2026 06:44:23 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

బిడ్డ తెల్లగా పుట్టడమే ఆ తల్లిపాలిట శాపమైంది

Date : 22 November 2025 03:09 PM Views : 206

Abhi9 News - క్రైమ్ వార్తలు / : కుటుంబ కలహాలు, అనుమానం చివరకు ఓ దారుణమైన హత్యకు దారి తీశాయి. తన చర్మం రంగు నల్లగా ఉండగా, పుట్టిన కొడుకు మాత్రం తెల్లగా ఉండటంపై స్నేహితులు, పొరుగువారు చేసిన ఎగతాళిని తట్టుకోలేకపోయిన ఓ భర్త, తన భార్యను అతి దారుణంగా హత్య చేశాడు. అనుమానంతో రగిలిపోయిన భర్త, ఏకంగా అత్తమామల ఇంటికి వెళ్లి ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ షాకింగ్ సంఘటన బీహార్‌లోని కతిహార్ జిల్లాలోని అబాద్‌పూర్ థానే పరిధిలోని నారాయణ్‌పూర్ గ్రామంలో జరిగింది. బిడ్డ రంగుపై అనుమానం అజమ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జల్కి గ్రామానికి చెందిన సుకుమార్ దాస్, మౌసుమి దాస్ దంపతులకు మూడు నెలల క్రితం కొడుకు పుట్టాడు. సుకుమార్ నల్లగా ఉండగా.. ఆ బిడ్డ తెల్లగా పుట్టాడు. ఈ తేడా కారణంగా నువ్వు నల్లగా ఉన్నావు, నీకు తెల్ల కొడుకు ఎలా వచ్చాడు..? అంటూ సుకుమార్ స్నేహితులు, పొరుగువారు అతన్ని ఆటపట్టించడం మొదలుపెట్టారు. ఈ ఎగతాళి కారణంగా సుకుమార్ మనసులో తీవ్రమైన అనుమానాలు మొదలయ్యాయి. ఆ బిడ్డకు నిజమైన తండ్రి ఎవరో చెప్పాలంటూ భార్య మౌసుమితో నిత్యం గొడవ పడటం మొదలుపెట్టాడు. ఈ విషయంలో దాదాపు మూడు నెలలుగా భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరుగుతుండగా, మౌసుమి తండ్రి కూడా అతన్ని ఒప్పించడానికి ప్రయత్నించాడు. గొడవలు ఎక్కువ కావడంతో మౌసుమి తన పుట్టింటికి వెళ్లింది. భార్య గొంతు కోసి.. అనుమానం, కోపంతో రగిలిపోయిన సుకుమార్.. అత్తగారింటికి వెళ్లాడు. రాత్రి అందరూ భోజనం చేసి నిద్రపోయిన తర్వాత సుకుమార్ దారుణానికి పాల్పడ్డాడు. భార్య మౌసుమి దాస్‌ గొంతు కోసి హత్య చేయడమే కాక ఆమె ప్రైవేట్ భాగాలను చాలాసార్లు పొడిచి దారుణంగా హింసించాడు. మరుసటి రోజు ఉదయం కుటుంబ సభ్యులు మేల్కొని, గదిలోకి వెళ్లి చూడగా, మౌసుమి రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉంది. అల్లుడు సుకుమార్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ సంఘటన తర్వాత గ్రామంలో తీవ్ర కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పరారీలో ఉన్న సుకుమార్ దాస్‌పై కేసు నమోదు చేసి, అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :