Saturday, 18 April 2026 06:47:29 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

విడాకులు ఇవ్వలేదనీ.. రోడ్డుపై వెంటాడి భార్యను హత్య చేసిన భర్త!

సూర్యరావుపేటలో దారుణం చోటు చేసుకుంది. నిత్యం ప్రజల రాకపోకలతో రద్దీగా ఉండే ప్రాంతంలో భార్యను దారుణంగా హత్య చేశాడు విజయ్ అనే వ్యక్తి.

Date : 14 November 2025 03:57 PM Views : 220

Abhi9 News - క్రైమ్ వార్తలు / సూర్యాపేట : విజయవాడ సూర్యరావుపేటలో దారుణం చోటు చేసుకుంది. నిత్యం ప్రజల రాకపోకలతో రద్దీగా ఉండే ప్రాంతంలో భార్యను దారుణంగా హత్య చేశాడు విజయ్ అనే వ్యక్తి. నూజివీడుకు చెందిన స్టాఫ్ నర్స్ సరస్వతి, విజయవాడకు చెందిన ల్యాబ్ టెక్నీషియన్ విజయ్ ఇద్దరు 2022లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ బాబు సంతానం. ప్రస్తుతం రెండేళ్ల బాబుతో సరస్వతి వేరుగా నివాసం ఉంటుంది. 2022 ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజున పెళ్లి చేసుకున్న ఇద్దరు కలకాలం జీవిస్తారని భావిస్తే.. పెళ్ళైన నెలల వ్యవధిలోనే ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీనితో దాదాపు ఏడాదిన్నర కాలంగా సరస్వతి, విజయ్ వేరుగా నివాసం ఉంటున్నారు. అయితే ఇద్దరి మధ్య మనస్పర్థలతో సరస్వతి ఒంటరిగా నివాసం ఉంటున్న వేళ.. భర్త విజయ్ పై వేధింపుల కేసు పెట్టింది. దీనితో నూజివీడులో కేసు నమోదు కాగా 5 నెలల జైలుకు సైతం వెళ్లొచ్చాడు. దీనితో ఇద్దరి విబేధాలు తారస్థాయికి చేరాయి. చాలాకాలంగా భార్యను చంపుతానని బెదిరిస్తున్న విజయ్ గురువారం సరస్వతి పని చేస్తున్న వీన్స్ ఆసుపత్రికి వద్దకు వచ్చాడు. ఆ సమయంలో విధులు ముగించుకొని వస్తున్న భార్యను వెంటాడి వెంటాడి కత్తితో పొడిచి హత్య చేశాడు. వీన్స్ ఆసుపత్రి నుంచి పరిగెత్తి కత్తితో దాడి చేసిన విజయ్ ను నిలువరించేందుకు వెళ్ళిన స్థానికులను సైతం బెదిరించాడు. దీనితో సరస్వతిని కాపాడేందుకు వెళ్ళి ఏమి చేయలేక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. పోలీసులు వచ్చి విజయ్ ను అదుపులోకి తీసుకున్నారు. భార్య తనను వేధిస్తున్న కారణాలతో హత్య చేశానని పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు నిందితుడు విజయ్. వివాహేతర సంబంధం పెట్టుకొని కేసులు పెట్టీ తనని సరస్వతి వేధిస్తోందని తెలిపాడు. అరెస్టు చేయించడంతో పాటు విడాకులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్న కారణంగా హత్య చేశానని విజయ్ పోలీసుల విచారణలో తెలిపాడే. హత్య చేశానన్న పశ్చాత్తాపం లేకుండా పోలీసులతో వాగ్వాదంకు దిగడంతో పాటు తాను చనిపోతానని బెదిరింపులకు దిగడం గమనార్హం. విజయ్ నుంచి కత్తిని స్వాధీనం చేసుకొన్న పోలీసులు నిందితుడిని స్టేషన్ కు తరలించారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :