Saturday, 18 April 2026 05:12:38 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

యాంటీ డ్రగ్ సోల్జర్స్ గా యువత పని చేయాలి

డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి.. జిల్లా ఎస్పీ శ్రీ యోగేష్ గౌతమ్ ఐపీఎస్... స్థానిక ఎమ్మెల్యే చిట్టెంపర్ణిక రెడ్డి

Date : 18 September 2025 06:22 PM Views : 217

Abhi9 News - క్రైమ్ వార్తలు / Hyderabad : నేటి యువత గంజాయి డ్రగ్స్ వంటి మత్తుపదార్థాల వాడకాన్ని పూర్తిగా నిర్మూలించి భావితరాలకు బంగారు బాటలు వేసేందుకు యాంటీ డ్రగ్స్ సోల్జర్స్ గా పనిచేయాలని మరియు నారాయణపేట జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లా గా మార్చేందుకు మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని జిల్లా ఎస్పీ శ్రీ యోగేష్ గౌతమ్ ఐపీఎస్, స్థానిక ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి లు తెలిపారు. గురువారం ఉదయం డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ కోసం విద్యార్థి సేన ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నారాయణపేట జిల్లా కేంద్రంలో విద్యార్థులతో విద్యార్థి మహా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ శ్రీ యోగేష్ గౌతమ్ ఐపీఎస్, స్థానిక ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి లు ముఖ్య అతిథులుగా హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... యువత గంజాయి డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల బారిన పడితే మీ భవిష్యత్తు అంధకారం అవుతుందని, ఈ అలవాటు వ్యక్తిగత ఆరోగ్యం మాత్రమే కాదు కుటుంబం, సమాజం మొత్తాన్ని దెబ్బతీస్తుందని యువత భవిష్యత్తు కోసం అందరం కలిసికట్టుగా పోరాడాలని పోలీస్ విభాగం మాదకద్రవ్యాల వ్యాప్తిని అరికట్టడంలో కఠిన చర్యలు తీసుకుంటుందని, తల్లిదండ్రుల తమ పిల్లల ప్రవర్తనను గమనిస్తూ వారిలో అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. ఎవరైనా డ్రగ్స్ బారిన పడిన, రవాణా చేస్తున్న, అమ్మిన అట్టి వ్యక్తుల సమాచారం లోకల్ పోలీసులకు లేదా డయల్ 100 కి లేదా 1908 టోల్ ఫ్రీ నెంబర్లకు సమాచారం ఇవ్వాలని ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచి అట్టి వ్యక్తులపై చట్ట ప్రకారం కట్టిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు. డ్రగ్స్ గంజాయి వంటి వాటికి దూరంగా ఉండి నారాయణపేట జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లా గా మార్చేందుకు ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని ఎస్పీ కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ పై కఠినంగా పనిచేస్తుందని, చట్టపరమైన చర్యలతో పాటు ప్రజల్లో చైతన్యం కలిగించడమే ముఖ్య లక్ష్యం అని, ఇలాంటి విద్యార్థి ర్యాలీలు సమాజంలో మార్పు తీసుకొస్తాయని పేర్కొన్నారు. గంజాయి డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, ఇది కేవలం ఆరోగ్యాన్ని మాత్రమే కాదు మీ కుటుంబాన్ని మీ కలలను కూడా నాశనం చేస్తుందని తెలిపారు. కావున ప్రతి ఒక్కరూ మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ కొరకు అందరు పాటుపడాలని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ డ్రగ్స్ ఫ్రీ అవగాహన కోసం విద్యార్థులు డ్రగ్స్ మానుకోవడం పై రూపొందించిన పోస్టర్లు ప్లకార్డులు నినాదాలతో ర్యాలీ నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో సిఐ శివ శంకర్, ఎక్సైజ్ సీఐ ఎస్ఐ రాముడు, ఎక్సైజ్ ఎస్ఐలు స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యార్థి సేన ఆర్గనైజేషన్ వారు, విద్యార్థులు పాల్గొన్నారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :