Abhi9 News - క్రైమ్ వార్తలు / Hyderabad : హైదరాబాద్ శివారు మోకిల పరిధిలోని మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు చెట్టును ఢీకొట్టడంతో అందులో ఉన్న నలుగురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు గాయపడ్డారు. మృతులను సూర్యతేజ (20), సుమిత్ (20), శ్రీనిఖిల్ (20), రోహిత్ (18)గా గుర్తించారు. వీరంతా ICFA ఇన్స్టిట్యూట్లో చదువుతున్నట్లు తెలుస్తోంది. కారులో మోకిల నుంచి హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం జరిగింది.
Admin
Abhi9 News