Saturday, 18 April 2026 06:39:57 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

ప్రేమ పెళ్లి చేసుకున్నారని దారుణం..

జగిత్యాల జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. తన కుమార్తెను ప్రేమ వివాహం చేసుకున్నాడనే కోపంతో యువతి కుటుంబ సభ్యులు యువకుడి ఇంటిపై దాడి చేశారు. యువతి బంధ

Date : 25 November 2025 10:53 AM Views : 226

Abhi9 News - క్రైమ్ వార్తలు / : ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని అబ్బాయి కుటుంబ సభ్యులపై అమ్మాయి కుటుంబ సభ్యులు కర్రలతో దాడి చేసి యువతిని తీసకెళ్లిన ఘటన జగిత్యాల జిల్లాలో వెలుగు చూసింది. మల్యాల మండల కేంద్రానికి చెందిన నల్ల ముత్తు కుమార్.. గుంటూరు జిల్లా మాచర్ల గ్రామానికి చెందిన సోముల మాధవి గత కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవలే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని ఇద్దరి ఇంటి పెద్దలకు చెప్పారు. కానీ ఈ పెళ్లికి అమ్మాయి పేరెంట్స్ ఒప్పుకోలేదు. దీంతో కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిదిలో గత వారం రోజుల క్రితం వివాహం చేసుకున్నారు. విషయం తెలిసిన అమ్మాయి పేరెంట్స్ తో పాటు.. కుటుంబ సభ్యులు కొంతమంది అబ్బాయి ఇంటికి వచ్చి గొడవ చేశారు. దీంతో అబ్బాయి కుటుంబ సభ్యులు మల్యాల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇరు కుటుంబ సభ్యులను పీఎస్‌కు పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించి పంపించారు. అయితే ఎలగైనా తమ కుమార్తెను తీసుకెళ్లాలని నిర్ణయించుకున్న యువతి కుటుంబ సభ్యులు.. సోమవారం అబ్బాయి ఇంటిపై క్రరలతో దాడి చేసి అమ్మాయిని తీసుకెళ్లారు. యువతి కుటుంబ సభ్యుల దాడిలో అబ్బాయి తల్లిదండ్రులు, పలువురు గాయపడ్డారు.గమనించిన స్థానికులు వారిని వెంటనే స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువతి కుటుంబ సభ్యుల నుంచి ఆమెకు ప్రాణహాని ఉందని.. అమ్మాయిని తమకు అప్పగించాలని యువకుడి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. దాంతో పాటు వారు తమపై మళ్లీ దాడి చేసే అవకాశం ఉందని.. తమకు రక్షణ కల్పించాలని ముత్తు కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :