Saturday, 13 June 2026 04:59:18 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

టీచర్‌కు హెడ్‌మాస్టర్‌ లైంగిక వేధింపులు

మందలించిన విద్యాధికారిపై బెల్ట్‌తో దాడి

Date : 24 September 2025 09:44 PM Views : 287

Abhi9 News - క్రైమ్ వార్తలు / : అతడొక ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు. తన పాఠశాలలో పనిచేస్తున్న సాటి ఉపాధ్యాయురాలి ని లైంగికంగా వేధించాడు. దాంతో ఆమె ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. టీచర్‌ ఫిర్యాదు మేరకు ఉన్నతాధికారులు ప్రధానోపాధ్యాయుడి నుంచి వివరణ కోరారు. దాంతో విద్యాధికారి కార్యాలయానికి వెళ్లిన ప్రధానోపాధ్యాయుడు ఇచ్చిన వివరణతో సదరు అధికారి సంతృప్తి చెందలేదు. దాంతో ఆగ్రహించిన ప్రధానోపాధ్యాయుడు బెల్ట్‌ తీసుకుని అధికారిపై దాడి చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. బ్రిజేంద్ర కుమార్‌ వర్మ అనే వ్యక్తి ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం సీతాపూర్‌ జిల్లాలోని మహమ్మదాబాద్‌ బ్లాక్‌లోగల ఓ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అదే స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్న ఓ మహిళను బ్రిజేంద్ర కుమార్‌ లైంగికంగా వేధించాడు. దాంతో ఆమె ఘటనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. మహిళా టీచర్‌ ఫిర్యాదు మేరకు సీతాపూర్‌ జిల్లాకు చెందిన ‘బేసిక్‌ శిక్షా అధికారి ’ అఖిలేష్‌ ప్రతాప్‌ సింగ్‌.. హెడ్మాస్టర్‌ బ్రిజేంద్ర కుమార్‌ నుంచి క్లారిఫికేషన్‌ కోరారు. దాంతో విద్యాధికారి కార్యాలయానికి వెళ్లిన బ్రిజేంద్ర కుమార్‌.. అధికారి అఖిలేష్‌ ప్రతాప్‌ సింగ్‌కు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ బ్రిజేంద్ర ఇచ్చే వివరణతో అధికారి సంతృప్తి చెందలేదు. అతడు చేసిన పనికి తీవ్రంగా మందలించాడు. దాంతో హెడ్మాస్టర్‌ బ్రిజేంద్రలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తన చేతిలోని ఫైల్‌ను అధికారి టేబుల్‌పై విసిరిపారేశాడు. అంతటితో ఆగకుండా తన నడుముకున్న బెల్ట్‌ తీసి అధికారిపై దాడికి పాల్పడ్డాడు. ఇంతలో క్యాబిన్‌ బయట ఉన్న సిబ్బంది వచ్చి హెడ్మాస్టర్‌ను పట్టుకున్నారు. ఆ తర్వాత విద్యాధికారి ఫిర్యాదు మేరకు పోలీసులు హెడ్మాస్టర్‌ బ్రిజేంద్రను అరెస్ట్‌ చేసి తీసుకెళ్లారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :