Saturday, 18 April 2026 05:14:40 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

బస్సు దగ్ధం.. కావేరి ట్రావెల్స్ సంచలన నిర్ణయం

Date : 24 October 2025 11:13 AM Views : 211

Abhi9 News - క్రైమ్ వార్తలు / కర్నూలు : కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద వి కావేరీ ట్రావెల్స్ బస్సు దగ్ధం కావడంతో.. 20 మందికిపైగా ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో వి కావేరి ట్రావెల్స్ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ట్రావెల్స్‌కు సంబంధించి కార్యాలయాలు అన్నింటిని మూసివేసింది. ఈ ఘోర ఘటన జరిగినప్పటికీ వి కావేరి ట్రావెల్ యాజమాన్యం అందుబాటులోకి రాలేదు. అయితే ఈ ప్రమాదానికి గురైన బస్సుపై తెలంగాణలో రెండు రాష్ డ్రైవింగ్ చలానాలు విధించినట్లు సమాచారం. ఇక ఈ ప్రమాదం జరిగిన బస్సులో కూకట్‌పల్లి నుంచి ఏడుగురు ప్రయాణికులు ఎక్కినట్లు సమాచారం. ఈ ప్రయాణికుల్లో హర్ష, రామిరెడ్డి, సూర్య ప్రాణాలతో బయటపడ్డారు. అలాగే ధాత్రి, చందన, మంగా, అమృత్ కుమార్‌ల ఫోన్లు స్విచ్ ఆఫ్ అయినట్లు గుర్తించారు. ఇక సూరారం నుంచి ఈ బస్సు ఎక్కిన గుణ సాయి సైతం క్షేమం ఉన్నారు. అలాగే బహదూర్‌పల్లిలో ఈ బస్ ఎక్కిన ప్రశాంత్ ఫోన్ సైతం రీచ్ కావడం లేదు. ఇదే ప్రాంతం నుంచి ఈ బస్సు ఎక్కిన సుబ్రహ్మణ్యం సురక్షితంగా ఉన్నారు. అదే విధంగా గండిమైసమ్మ చౌరస్తా వద్ద బస్సు ఎక్కిన సత్యనారాయణ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయినట్లు తెలుస్తుంది. చింతల్‌లో బస్సు ఎక్కిన వేణు గుండాల ఫోన్ స్విచ్ ఆఫ్ అయినట్లు సమాచారం. దీంతో ఆయా కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కర్నూలు జిల్లాలో చిన్నటేకూరు వద్ద శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్‌ ప్రమాదానికి గురై మంటలు చెలరేగాయి.ఈ ప్రమాదంలో 20 మంది మరణించినట్లు తెలుస్తోంది. మరో 12 మంది స్వల్పంగా గాయపడినట్లు సమాచారం. బస్సును బైక్ ఢీకొట్టి ముందుభాగంలోకి దూసుకెళ్లింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ అగ్ని ప్రమాదంలో పలువురు సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాద సమయంలో బస్సులో 39 మంది ఉన్నట్లు తెలుస్తుంది.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :