Saturday, 18 April 2026 06:44:22 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

సమోసా కోసం హత్య ..!

సమోసా కోసం ఏకంగా ఓ హత్య జరిగింది. ఓ వ్యక్తిని మహిళ కత్తితో కొట్టిమరీ చంపింది. ఈ విచిత్ర ఘటన బీహార్‌లోని భోజ్‌పూర్ జిల్లాలో జరిగింది.

Date : 23 October 2025 11:51 AM Views : 174

Abhi9 News - క్రైమ్ వార్తలు / : ఘుమఘుమలాడే వేడివేడి సమోసా చూస్తే నోరూరని వారుండరంటే అతిశయోక్తి కాదేమో. చల్లని సాయంత్రాల్లో చాలా మంది భోజన ప్రియులకు సమోసా బెస్ట్ చిరుతిండి. అయితే తాజాగా సమోసా కోసం ఏకంగా ఓ హత్య కూడా జరిగింది. ఈ విచిత్ర ఘటన బీహార్‌లోని భోజ్‌పూర్ జిల్లాలో జరిగింది. ఆదివారం (అక్టోబర్‌ 19) సమోసాల విషయంలో ఏర్పడిన చిన్న వివాదం చిరిగి చిరిగి హత్యకు దారితీసింది. అసలింతకీ ఏం జరిగిందంటే.. బీహార్‌లోని భోజ్‌పూర్ జిల్లాలో కౌలోదిహరి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి స్థానిక దుకాణంలో సమోసాలు కొనడానికి వెళ్ళాడు. అయితే అతడు అక్కడున్న ఇతర కస్టమర్లతో అనుకోకుండా గొడవకు దిగాడు. దీంతో వారు అతడు కొనుగోలు చేసిన సమోసాల ప్యాకెట్‌ లాక్కోవడమే కాకుండా అతడిపై దాడి చేశారు. గమనించిన స్థానికంగా ఉండే చంద్రమ యాదవ్ అనే వ్యక్తి జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించాడు. వాగ్వాదం ఆపేందుకు చిన్న చర్చగా ప్రారంభమైన ఈ యవ్వారం చిరిగి చిరిగి గాలివానగా మారింది. దీంతో దుఖాణం వద్దకు చేరిన కొందరు గ్రామస్తుల మధ్య తీవ్ర ఘర్షణకు దారి తీసింది. ఇంతలో దుకాణం యజమాని అయిన ఓ మహిళ పదునైన కత్తితో చంద్రమ యాదవ్ తలపై కొట్టింది. దీంతో తీవ్ర గాయాలైన అతడు రక్తస్రావంతో కుప్పకూలాడు. స్థానికులు అతడిని పాట్నాలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం చంద్రమ యాదవ్‌ మరణించాడు. సమాచారం అందుకున్న భోజ్‌పూర్ పోలీసులు హత్య కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. చంద్రమ యాదవ్‌పై దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళను సంఘటన జరిగిన కొద్దిసేపటికే అరెస్టు చేశారు. సమోసా విషయంలో జరిగిన చిన్న గొడవ ఏకంగా ఓ వ్యక్తి ప్రాణాలను బలి తీసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. ఈ హత్యోదంతంలో ఇతరుల ప్రమేయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :