Saturday, 18 April 2026 05:20:39 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

కానిస్టేబుల్‌ హత్య కేసు నిందితుడు రియాజ్ ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడా.. ఇదిగో క్లారిటీ

నిజామాబాద్లో కానిస్టేబుల్ ప్రమోద్ను హత్య చేసి పరారైన రియాజ్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు.

Date : 19 October 2025 05:02 PM Views : 205

Abhi9 News - క్రైమ్ వార్తలు / నిజామాబాద్ : నిజామాబాద్లో సంచలనం రేపిన కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు నిందితుడ్ని పోలీసులు సినీ ఫక్కీలో చేజ్‌ చేసి పట్టుకున్నారు. రెండు రోజుల క్రితం ప్రమోద్‌ను కత్తితో పొడిచి పరారైన నిందితుడు రియాజ్‌ను నిజామాబాద్ నగర శివారులోని సారంగపూర్ సమీపంలో అరెస్ట్‌ చేశారు. రోడ్డు పక్కన ఉన్న పాడుబడిన లారీ క్యాబిన్‌లో దాక్కునట్లు సమాచారం అందుకున్న పోలీసులు.. డ్రోన్‌లతో అన్వేషిస్తూ అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు చిక్కినట్టే చిక్కి.. పారిపోతుండగా ఛేజ్ చేసి మరీ పట్టుకోవాల్సి వచ్చింది. అయితే మరో వ్యక్తితో జరిగిన గొడవలో గాయాలు అవ్వడంతో ప్రస్తుతం రియాజ్‌ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిందితడు ఎన్‌కౌంటర్‌లో హతమయినట్లు వస్తున్న వార్తలను సీపీ ఖండించారు. అతనిపై ఎలాంటి కాల్పులు జరపలేదని స్పష్టం చేశారు. వేరే వ్యక్తితో జరిగిన ఘర్షణలో మాత్రమే రియాజ్‌కు గాయాలయినట్లు వివరించారు. వరుస చోరీలకు పాల్పడుతున్న రియాజ్‌ను అతని మేనల్లుడి ఆకాశ్‌‌‌‌ సాయంతో సీసీఎస్‌‌‌‌ కానిస్టేబుల్‌‌‌‌ ప్రమోద్‌ రెండు రోజుల క్రితం అదుపులోకి తీసుకుని బెక్‌పై వెళ్తుండగా.. సడెన్‌గా కత్తితో దాడి చేశాడు. కానిస్టేబుల్‌‌‌‌ ప్రమోద్‌ ఛాతిలో పొడవడంతో పాటు అతడి మేనల్లుడు ఆకాశ్‌‌‌‌, ఎస్సై విఠల్‌‌‌‌ను గాయపరిచి పారిపోయాడు. దీంతో.. ఈ కేసును చాలెంజ్‌‌‌‌గా తీసుకున్న సీపీ సాయిచైతన్య.. నిందితుడు రియాజ్‌‌‌‌ను పట్టుకునేందుకు స్పెషల్‌‌‌‌ టీమ్‌‌‌‌లను రంగంలోకి దింపారు. రెండు రోజులుగా డ్రోన్‌లు, స్పెషల్ టీమ్‌లతో రియాజ్‌ కోసం నిజామాబాద్‌ పోలీసులు గాలిస్తుండగా.. శనివారం రాత్రి నిజాంసాగర్‌ కెనాల్‌ సమీపంలో చిక్కినట్టే చిక్కి పారిపోయాడు. దీంతో మరింత ఫోకస్‌ పెట్టి సమీప ప్రాంతాలను జల్లెడ పట్టారు. ఈ క్రమంలోనే.. సారంగపూర్ దగ్గర ఉన్నాడనే పక్కా సమాచారంతో ఎటాక్‌ చేసి నిందితుడు రియాజ్‌ను అరెస్ట్ చేశారు. ఇక.. రియాజ్‌పై నిజామాబాద్ జిల్లాలో 40 కేసులు ఉండడం షాకిస్తోంది. వెహికల్స్ చోరీ, దొంగతనాలు, చైన్ స్నాచింగ్‌లు, మర్డర్ కేసుల్లో నిందితుడిగా ఉన్న రియాజ్‌.. బెయిల్పై రిలీజై నేరాలు చేస్తున్నట్లు గుర్తించారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :