Saturday, 18 April 2026 06:41:37 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

కాలేజీలో దారుణం.. వాష్‌రూమ్‌లో విద్యార్థినిపై అత్యాచారం

Date : 17 October 2025 07:39 PM Views : 196

Abhi9 News - క్రైమ్ వార్తలు / : దక్షిణ బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న విద్యార్థినిపై, ఆమె సహచర విద్యార్థి అత్యాచారానికి పాల్పడ్డాడు. క్యాంపస్‌లోని ఆరవ అంతస్తులో ఉన్న మగవారి వాష్‌రూమ్‌లో ఈ అఘాయిత్యం జరిగినట్లు బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి నిందితుడు జీవన్ గౌడ (21)ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఈ నెల10న జరగ్గా, బాధితురాలు ఐదు రోజుల తర్వాత 15న ధైర్యం చేసి ఫిర్యాదు చేసింది. నిందితుడు జీవన్ గౌడ, బాధితురాలు గతంలో క్లాస్‌మేట్స్ అని, అయితే బ్యాక్‌లాగ్ కారణంగా నిందితుడు చదువులో వెనుకబడ్డాడని ప్రాథమిక సమాచారం. ఘటన జరిగిన రోజు లంచ్ బ్రేక్ సమయంలో జీవన్ గౌడ బాధితురాలికి పదేపదే ఫోన్ చేసి కలవాలని కోరాడు. ఆమె అక్కడికి రాగానే, అతడు బలవంతంగా ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించాడు. అతడి నుంచి తప్పించుకునేందుకు బాధితురాలు లిఫ్ట్ వైపు వెళ్లగా, నిందితుడు ఆమెను ఆరవ అంతస్తు వరకు వెంబడించాడు. అక్కడ ఆమెను బలవంతంగా మగవారి వాష్‌రూమ్‌లోకి లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. ఈ దారుణం తర్వాత బాధితురాలు తన ఇద్దరు స్నేహితులకు విషయం చెప్పింది. అనంతరం నిందితుడు బాధితురాలికి ఫోన్ చేసి, ‘పిల్ ఏమైనా కావాలా?’ అని అడిగినట్లు కూడా ఫిర్యాదులో ప్రస్తావించారు. మొదట ఈ విషయం చెప్పడానికి సంకోచించినా, ఆ తర్వాత బాధితురాలు తన తల్లిదండ్రులకు చెప్పింది. వారి సహకారంతో హనుమంతనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడు జీవన్ గౌడను బుధవారం అదుపులోకి తీసుకుని, కోర్టు ఆదేశాల మేరకు జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఈ ఘటనపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ 64 (అత్యాచారానికి శిక్ష) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :