Saturday, 13 June 2026 04:59:15 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

మిషన్‌ భగీరథ కార్మికుడి ఆత్మహత్య

నాలుగు నెలలుగా అందని వేతనాలు మనోవేదనతో గాంధీ బలవన్మరణం మృతదేహంతో పంపుహౌస్‌ వద్ద కుటుంబ సభ్యులు, కార్మికుల ధర్నా ఖమ్మం జిల్లా పాలేరులో ఘటన

Date : 24 September 2025 07:52 AM Views : 285

Abhi9 News - క్రైమ్ వార్తలు / ఖమ్మం : నాలుగు నెలలుగా వేతనాలు రాకపోవడం.. కుటుంబ పోషణ భారంగా మారడంతో మనోవేదనతో ఓ కార్మికుడు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరులో మంగళవారం చోటుచేసుకున్నది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. చందనబోయిన గాంధీ (32) ఎనిమిదేండ్లుగా పాలేరులోని మిషన్‌ భగీరథ ఫిల్టర్‌ బెడ్‌లో కార్మికుడిగా పని చేస్తున్నాడు. వేతనాల కోసం 20 రోజుల క్రితం తోటి కార్మికులతో కలిసి ఆందోళనకు దిగడంతో అధికారులు, మిషన్‌ భగీరథ గుత్తేదారులు జీతాలు ఇస్తామని హామీ ఇవ్వడంతో వారంతా విధుల్లో చేరారు. 20 రోజులు దాటినా జీతాలు రాకపోవడంతో సోమవారం నుంచి మిషన్‌ భగీరథ కార్మికులు జిల్లావ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. మంగళవారం కార్మికులతో కలిసి ఆందోళనలో పాల్గొన్న గాంధీ మధ్యాహ్నం భోజనం చేయడానికి ఇంటికి వెళ్లి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాంధీ మృతదేహాన్ని మిషన్‌ భగీరథ పంపుహౌస్‌ వద్దకు తీసుకొచ్చి కుటుంబ సభ్యులు, కార్మికులు ధర్నాకు దిగారు. మిషన్‌ భగీరథ గుత్తేదారు, అధికారులు గాంధీ కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. గాంధీకి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కూసుమంచి ఎస్సై నాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :