Saturday, 18 April 2026 06:47:50 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

పెళ్లి చేస్తామని నమ్మించి, ఇంటికి పిలిపించి.. యువకుడు దారుణ హత్య.!

సంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. తమ కూతురిని ప్రేమించాడనే నెపంతో ఓ యువకుణ్ని ఇంటికి పిలిపించి దాడిచేసి హతమార్చారు కుటుంబ సభ్యులు.

Date : 10 December 2025 07:28 PM Views : 199

Abhi9 News - క్రైమ్ వార్తలు / సంగారెడ్డి : అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీరంగూడలో దారుణం జరిగింది. తమ కూతురిని ప్రేమిస్తున్నాడనే కారణంతో ఓ యువకుణ్ని ఇంటికి పిలిపించి హతమార్చారు యువతి తల్లిదండ్రులు. అసలేం జరిగిందంటే... జ్యోతి శ్రావణ్ సాయి అనే 20 ఏళ్ల యువకుడు.. మైసమ్మగూడలోని సెయింట్ పీటర్ కళాశాలలో బీటెక్ సెకండియర్ చదువుతున్నాడు. కుత్బుల్లాపూర్‌లో రూమ్‌ తీసుకుని అక్కడి నుంచి రోజూ కాలేజీకి వెళ్లివస్తున్నాడు. ఇతను.. బీరంగూడకు చెందిన శ్రీజ అనే 19 ఏళ్ల యువతితో కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నాడు. వీరిద్దరూ పదో తరగతి వరకూ కలిసి చదువుకోవడంతో సాన్నిహిత్యం ఏర్పడి.. ప్రేమకు దారితీసినట్టు తెలుస్తోంది. ఈ విషయం తెలిసి ఇరువురినీ పలుమార్లు హెచ్చరించారు శ్రీజ తల్లిదండ్రులు. అయినా వినిపించుకోకపోవడంతో ఆగ్రహించిన యువతి తల్లిదండ్రులు.. పెళ్లి చేస్తామని నమ్మించి, మాట్లాడుకుందామని చెప్పి సాయిని ఇంటికి పిలిపించారు. దీంతో ఆ యువకుడు శ్రీజ నివాసానికి వెళ్లాడు. అక్కడికి వెళ్లగానే.. ఒక్కసారిగా యువతి కుటుంబ సభ్యులు అతడిపై దాడికి పాల్పడి హతమార్చారు. విషయం తెలుసుకున్న అమీన్‌పూర్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం పటాన్‌చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :