Saturday, 18 April 2026 05:14:41 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

పోలీసుల రైడ్స్ లో పట్టుబడ్డ రాజకీయ ప్రముఖులు

హైదరాబాద్‌ శివార్లలో మరో లిక్కర్‌ పార్టీని భగ్నం చేశారు పోలీసులు. 25 మంది పురుషులు, 8 మంది మహిళలను అరెస్ట్ చేశారు.

Date : 16 October 2025 10:44 PM Views : 255

Abhi9 News - క్రైమ్ వార్తలు / Hyderabad : హైదరాబాద్ మహానగరంలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతోంది. అయితే ఫామ్‌హౌజ్‌లలో వరుస పార్టీలు.. పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా తగ్గేదే లేదంటున్నారు పార్టీ ప్రియులు. లేటేస్ట్‌గా హైదరాబాద్‌ శివార్లలో మరో లిక్కర్‌ పార్టీని భగ్నం చేశారు పోలీసులు. రంగారెడ్డి జిల్లా మంచాల పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేగింది. లింగంపల్లిలోని ఓ ఫామ్‌హౌస్‌లో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న లిక్కర్ పార్టీని భగ్నం చేశారు పోలీసులు. పక్కా సమాచారంతో ఫామ్‌హౌస్‌లో రైడ్స్‌ చేసిన పోలీసులు.. 25 మంది పురుషులు, 8 మంది మహిళలను అరెస్ట్ చేశారు. వారి నుండి 2 లక్షల 40 వేల రూపాయలతో పాటు 11 వాహనాలు, 15 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులందిరినీ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అయితే నిందితుల్లో పలువురు రాజకీయ ప్రముఖులు ఉండడం జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ సంచలనం రేపుతోంది. పట్టుబడ్డ 8 మంది మహిళలను మహారాష్ట్రకు చెందినవారిగా గుర్తించగా నిందితుల్లో బీఆర్ఎస్‌ పార్టీకి చెందిన పలువురు నేతలు ఉన్నారు. హైదరాబాద్‌ శివార్లలోని ఫామ్‌హౌస్‌లు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారుతున్నాయి. ఇటీవలే మహేశ్వరంలో మిడ్‌నైట్‌ డర్టీ పార్టీకి చెక్‌ పెట్టారు పోలీసులు. పక్కా సమాచారంతో శివారులోని ఓ రిసార్ట్‌పై రెయిడ్‌ చేశారు. మందు, విందుతో పాటు అశ్లీల నృత్యాలు నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. ఓ సీడ్‌ కంపెనీకి చెందిన 50 మందితో పాటు 26 మంది యువతుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికల వేళ జరుగుతున్న ఈ వరుస పార్టీలు చర్చనీయాశంగా మారాయి. రేవ్ పార్టీలతో పాటు అనుమతి లేకుండా నిర్వహిస్తున్న లిక్కర్ పార్టీలపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నా కూడా అస్సలు తగ్గడం లేదు నిషాచరులు. మరోవైపు ఇలాంటి పార్టీలకు రిసార్స్ట్‌ను రెంట్‌కు ఇచ్చి రిస్క్‌లో పడవద్దని నిర్వాహకులకు సూచిస్తున్నారు పోలీసులు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :