Saturday, 18 April 2026 03:31:58 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది జవాన్లు మృతి

జమ్మూకశ్మీర్‌లో ఆర్మీ వాహనం అదుపుతప్పి ఓ లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 10 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు.

Date : 22 January 2026 06:29 PM Views : 190

Abhi9 News - క్రైమ్ వార్తలు / : జమ్మూకశ్మీర్‌లోని దోడా సెక్టార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జవాన్లతో వెళ్తున్న ఓ ఆర్మీ వాహనం అదుపుతప్పి 200 అడుగుల లోయలో పడింది. ఈ ప్రమాదంలో 10 మంది జవాన్లు మృతిచెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే సైన్యం, పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను హుటాహుటిన ఉధంపూర్ మిలటరీ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో పలువురి జవాన్ల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం 17 మంది సైనికులతో కూడిన ఆర్మీ వాహనం ఓ హై ఆల్టిట్యూడ్ పోస్టుకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. భదేర్వా-చంబా అంతర్రాష్ట్ర రహదారి వెంబడి ఖన్నీ టాప్ దగ్గర డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో వాహనం 200 అడుగల లోయలో పడినట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. గాయపడిన వారిలో పలువురు జవాన్ల పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పది మంది సైనికుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్న అధికారులు.. ఘటనా స్థలిలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. లెఫ్ట్‌నెంట్ గవర్నర్ సంతాపం.. ఈ ప్రమాదాన్ని జమ్మూకశ్మీర్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ధ్రువీకరించారు. ఈ ప్రమాదంలో 10 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయినట్లు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్‌' వేదికగా వెల్లడించారు. ప్రాణాలు కోల్పోయిన జవాన్ల కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు. ‘దోడాలో జరిగిన దురదృష్టకర ఘటనలో 10 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విచారకరం. మన సైనికుల అత్యుత్తమ సేవ, త్యాగాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటాం. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి’ అని సిన్హా పోస్ట్ చేశారు. ఈ ఘటనలో మరి కొంతమంది సైనికులు గాయపడగా.. వారిని ప్రత్యేక విమానంలో ఆస్పత్రికి తరలించారు. వీరందరికీ ఉత్తమ చికిత్స అందించాలంటూ అధికారులను ఆదేశించిన ఎల్జీ.. వారంతా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :