Saturday, 18 April 2026 05:18:33 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి!

Date : 22 November 2025 10:08 AM Views : 190

Abhi9 News - క్రైమ్ వార్తలు / : మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ముంబైలో ఎదురెదురుగా వస్తున్న వాహనాలపైకి వేగంగా వచ్చిన కారు దూసుకెళ్లింది. తానేలోని ఈస్ట్–వెస్ట్ ప్రాంతాలను కలిపే ఫ్లైఓవర్‌పై ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ముంబై సమీపంలోని అంబర్‌నాథ్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. థానేలోని తూర్పు – పశ్చిమాలను కలిపే ఈ రద్దీగా ఉండే వంతెన సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. కారు చాలా వేగంగా కదులుతుండటంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయి ఒకదాని తర్వాత ఒకటిగా అనేక వాహనాలను ఢీకొట్టింది. సంఘటన జరిగిన వెంటనే, కారు బ్రిడ్జిపై బోల్తా పడటంతో గందరగోళం నెలకొంది. ఈ సంఘటనలో అనేక వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారు చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు, స్థానిక అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయ చర్యలను ప్రారంభించారు. ప్రమాదానికి కారణమైన కారు స్థానిక స్థానిక శివసేన నాయకుడు ప్రమోద్‌ చౌబే పేరిట రిజిస్టర్‌ అయిందని పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో ఆయన కారులోనే ఉన్నారు. తీవ్రంగా గాయపడ్డ వారిని స్థానికులు హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. మునిసిపల్‌ కౌన్సిల్‌ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆయన భార్యకి మద్దతుగా ప్రచారానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగనట్లు తెలుస్తోంది. అయితే కారు డ్రైవర్‌కు హార్ట్‌ అటాక్‌ రావడతో ప్రమాదం జరిగిందని కొందరు చెబితే.. మద్యం సేవించి డ్రైవింగ్‌ చేయడం వల్లే ప్రమాదం జరిగిందని మరి కొందరు చెబుతున్నారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తు్న్నారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :