Saturday, 18 April 2026 05:20:39 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

నాగర్‌‌కర్నూల్‌‌ జిల్లాలో విషాదం.. ప్రాణం తీసిన మటన్

కొత్త ఇల్లు పూర్తి అయ్యిందన్న సంతోషంలో యజమాని దావత్ ఏర్పాటు చేశాడు. మేస్త్రీలు, సన్నిహితులను పిలిచాడు. అంతా దావత్‌లో మునిగిపోయారు. మందు తాగేవారు తాగుత

Date : 14 November 2025 11:30 AM Views : 186

Abhi9 News - క్రైమ్ వార్తలు / Hyderabad : నాగర్‌‌కర్నూల్‌‌ జిల్లా బొందలపల్లి గ్రామంలో విషాదం నెలకొంది. మటన్ భోజనం చేస్తుండగా గొంతులో బొక్క ఇరుక్కోవడంతో ఊపిరాడక వృద్ధుడు మరణించాడు. బుధవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. బొందలపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన కొత్త ఇల్లు నిర్మాణం పూర్తి కావడంతో మేస్త్రీలు, సన్నిహితుల కోసం దావత్ ఏర్పాటు చేశారు. ఈ విందుకు ఇంటి పక్కనే నివసించే పోలేముని లక్ష్మయ్య అనే వృద్ధుడు కూడా హాజరయ్యారు. విందులో భోజనం చేస్తుండగా లక్ష్మయ్య గొంతులో అకస్మాత్తుగా మటన్ బొక్క ఇరుక్కుపోయింది. ఊపిరి తీసుకోవడానికి తీవ్ర ఇబ్బంది పడిన లక్ష్మయ్య అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఇది గమనించిన తోటివారు హుటాహుటిన చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. అయితే దురదృష్టవశాత్తూ ఆసుపత్రికి తీసుకెళ్లే మార్గమధ్యలోనే లక్ష్మయ్య ఊపిరాడక మృతి చెందారు. మటన్ ఎముక శ్వాసనాళంలో ఇరుక్కోవడమే మరణానికి ప్రధాన కారణం. అంతేకాకుండా భోజనం చేసే సమయంలో లక్ష్మయ్య మద్యం సేవించి ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త ఇల్లు పూర్తైందన్న సంతోషంలో ఏర్పాటు చేసుకున్న విందు ఇలా విషాదంగా ముగియడంతో బొందలపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :