Saturday, 18 April 2026 06:50:10 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

టీచర్‌ను బెదిరించి డబ్బులు దోచుకున్న దొంగలు

టీచర్‌ను ఆటోలో ఎక్కించుకెళ్లి దోపిడీ చేసిన కేసును నర్సాపూర్‌ పోలీసులు 48 గంటల్లోనే చేధించారు.

Date : 21 October 2025 03:14 PM Views : 214

Abhi9 News - క్రైమ్ వార్తలు / Hyderabad : టీచర్‌ను ఆటోలో ఎక్కించుకెళ్లి దోపిడీ చేసిన కేసును నర్సాపూర్‌ పోలీసులు 48 గంటల్లోనే చేధించారు. సీసీ కెమెరాల సాయంతో ముగ్గురు నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. ఈ మేరకు కేసు వివరాలను తూప్రాన్‌ డీఎస్పీ నరేందర్‌ గౌడ్‌ శనివారం నాడు మీడియాకు వెల్లడించారు. డీఎస్పీ నరేందర్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం శివంపేటకు చెందిన ఉప్పరి సాయికుమార్, గొలుసుల కుమార్, కొల్చారం మండలం రంగంపేటకు చెందిన దారగుల్ల అనిల్ పాత నేరస్తులు. గతంలో పలు దొంగతనాల కేసులో జైలుకు వెళ్లొచ్చారు. ఇటీవల జైలు నుంచి వచ్చిన వీరు తమ బుద్ధిని మార్చుకోకుండా మరోసారి దొంగతనానికి స్కెచ్‌ వేశారు. ఈ క్రమంలో ఈ నెల 16న నవీన్‌ అనే వ్యక్తి ఆటోను తీసుకుని కొల్చారం బస్టాండ్‌ వద్ద తుంగని కిష్టయ్య అనే ఉపాధ్యాయుడిని ఆటోలో ఎక్కించుకున్నారు. నర్సాపూర్‌ సమీపంలోని తూప్రాన్‌ మార్గంలో ఉన్న ఓ కుంట వద్దకు తీసుకెళ్లి కిష్టయ్యపై దాడి చేశారు. చంపేస్తామని కత్తితో బెదిరించి అతని వద్ద నుంచి రూ.1200 నగదు, మొబైల్‌ ఫోన్‌ను ఎత్తుకెళ్లారు. అనంతరం పర్సును, కత్తిని కొద్దిదూరంలోని పొదల్లో వేసి వెళ్లిపోయారు. దొంగల నుంచి తప్పించుకున్న టీచర్‌ కిష్టయ్య పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించారు. టెక్నాలజీ సాయంతో పుల్కల్ మండలం శివంపేటలో ఉన్నారని గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసును 48 గంటల్లోనే చేధించిన సీఐ జాన్‌రెడ్డి, ఎస్సై రంజిత్ కుమార్‌, సిబ్బంది శ్రీకాంత్‌, ఉపేంద్రలను డీఎస్పీ నరేందర్‌ గౌడ్‌ అభినందించారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :