Saturday, 18 April 2026 06:45:44 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు గ్యాంగ్‌స్టర్లు హతం

ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. క్రైమ్ బ్రాంచ్, బీహార్ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టారు. ఈ ఎన్‌కౌంటర్‌లో బీహార్‌కు చెందిన

Date : 23 October 2025 11:37 AM Views : 230

Abhi9 News - క్రైమ్ వార్తలు / : ఢిల్లీలోని రోహిణిలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఎన్‌కౌంటర్‌లో బీహార్‌కు చెందిన నలుగురు మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్లు హతమయ్యారు. హాతుల్లో గ్యాంగ్ లీడర్ రంజన్ పాఠక్ ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో బుధవారం (అక్టోబర్‌ 22) రాత్రి ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ – బీహార్ పోలీసుల జాయింట్ ఆపరేషన్‌లో మొత్తం నలుగురు గ్యాంగ్‌స్టర్లు హతమయ్యారు. రాజధానిలో ఈ ముఠా కదలికలపై నిఘా వర్గాలు అందించిన సమాచారం మేరక ఈ ఎన్‌కౌంటర్ నిర్వహించారు. గురువారం తెల్లవారుజామున 2:20 గంటలకు ఈ కాల్పులు జరిగాయి. ఎన్‌కౌంటర్‌లో మరణించిన గ్యాంగ్‌స్టర్లను.. రంజన్ పాఠక్ (25), బిమ్లేష్ మహ్తో అలియాస్ బిమ్లేష్ సాహ్ని (25), మనీష్ పాఠక్ (33), అమన్ ఠాకూర్ (21)గా పోలీసులు గుర్తించారు. ఈ నలుగురు నిందితులు బీహార్‌లో అనేక క్రిమినల్ కేసుల్లో వాంటెడ్‌ లిస్ట్‌లో ఉన్నారు. ‘సిగ్మా & కంపెనీ’ పేరుతో చెలరేగుతున్న ఈ ముఠాకు రంజన్ పాఠక్ వహిస్తున్నాడు. బీహార్‌లో నమోదైన అనేక కేసుల్లో ఈ నలుగురు పరారీలో ఉన్నారు. అక్టోబర్ అర్ధరాత్రి బీహార్ పోలీసులు, ఢిల్లీ పోలీసుల క్రైమ్ బ్రాంచ్ సంయుక్తంగా రోహిణిలోని డాక్టర్ అంబేద్కర్ చౌక్, పన్సాలి చౌక్ మధ్య ఉన్న ప్రాంతంలో బహదూర్ షా మార్గ్‌లో నలుగురు గ్యాంగ్‌స్టర్లను ఢిల్లీ పోలీసులు కాల్చి చంపారు. బీహార్ ఎన్నికలకు ముందు ఈ నలుగురు పెద్ద కుట్రకు ప్రణాళిక వేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇంతలో ఢిల్లీ, బీహార్ పోలీసు బృందాలు వారిని ఎన్‌కౌంటర్‌లో హతమార్చడం విశేషం. కాగా ఢిల్లీలోని కరావాల్ నగర్‌కు చెందిన అమన్ ఠాకూర్ తప్ప, మిగిలిన ముగ్గురు గ్యాంగ్‌స్టర్లు బీహార్‌లోని సీతామర్హికి చెందినవారిగా పోలీసులు తెలిపారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :