Saturday, 18 April 2026 06:45:45 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

నకిలీ నంబర్ ప్లేట్‌తో రూ. 2.5 లక్షలు చోరీ.. పోలీసులకు ఎలా చిక్కాడంటే..?

దోమలగూడలో రూ.2.5 లక్షల నగదు దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. అశోక్ నగర్‌లోని యూనియన్ బ్యాంక్ నుంచి డబ్బులు డ్రా చేసుకున్న వృద్ధుడి చేతిలోంచి బ్యాగ్‌న

Date : 08 December 2025 05:58 PM Views : 210

Abhi9 News - క్రైమ్ వార్తలు / Hyderabad : హైదరాబాద్ నగరంలోని దోమలగూడ పరిధిలో ఈ నెల 4న జరిగిన నగదు దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. అశోక్ నగర్‌లోని యూనియన్ బ్యాంక్ నుంచి రూ. 2.5 లక్షల నగదు డ్రా చేసుకుని కారు వద్దకు వెళ్తున్న వృద్ధుడి చేతిలోంచి బ్యాగ్‌ను లాక్కొని పారిపోయిన నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్ఆర్ నగర్‌కు చెందిన వెంకటేశ్వరరావు ఈ నెల 4న అశోక్ నగర్‌లోని యూనియన్ బ్యాంక్‌లో రూ. 2.5 లక్షల నగదు డ్రా చేసుకున్నారు. రోడ్డుపై పార్క్ చేసిన తన కారు వద్దకు నడుచుకుంటూ వెళ్తుండగా బైక్‌పై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి ఆ వృద్ధుడిని ఢీకొట్టి చేతిలో ఉన్న నగదు బ్యాగ్‌తో పరారయ్యాడు. దీంతో బాధితుడు వెంటనే దోమలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నకిలీ నంబర్ ప్లేట్‌తో దొంగతనం కేసు నమోదు చేసిన దోమలగూడ పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. దొంగలగూడ ప్రాంతానికి చెందిన రాపిడో డ్రైవర్ అయిన తరుణ్ కుమార్ ఈ నేరానికి పాల్పడినట్లు గుర్తించారు. దొంగతనం చేసే సమయంలో నిందితుడు తన బైక్‌కు నకిలీ నంబర్ ప్లేట్ ఉపయోగించినట్లు తేలింది. దొంగతనం పూర్తయ్యాక జ్యోతి నగర్ మార్కెట్ వద్ద బట్టలు మార్చుకొని నంబర్ ప్లేట్‌ను తొలగించినట్లు సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డ్ అయింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిందితుడు తరుణ్ కుమార్‌ను అరెస్టు చేశారు. అతని నుంచి దొంగిలించిన బైక్‌తో పాటు రూ.2.29 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :