Saturday, 13 June 2026 05:03:44 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

నగరంలో మరో కొత్తమోసం వెలుగులోకి.. న్యూడ్‌ వీడియో కాల్‌ స్కామ్‌..

సైబర్ నేరగాళ్లు మరో కొత్త మోసానికి తెరలేపారు. అమ్మాయితో న్యూడ్ వీడియో కాల్ చేయించి.. ఆ తర్వాత బెదింపులకు పాల్పడుతున్నారు. తాజాగా నగరానికి చెందిన ఓ యువ

Date : 21 December 2025 08:58 AM Views : 193

Abhi9 News - క్రైమ్ వార్తలు / : అమ్మాయితో వీడియో కాల్‌ చేయించి, నగ్నంగా ఉన్న వీడియోలు రికార్డ్‌ చేసి బెదిరింపులకు పాల్పడిన సైబర్‌ నేరగాళ్లు నగరానికి చెందిన యువకుడి నుంచి రూ.3.41 లక్షలు వసూలు చేశారు. డబ్బులు చెల్లించినా.. ఇంకా వేధింపులు పెరగడంతో బాధితుడు సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. గౌలిగూడ ప్రాంతానికి యువకుడికి అక్టోబరు 5 రాత్రి 1.30 గంటలకు వీడియో కాల్‌ వచ్చింది. తన పేరు జ్యోతి గుప్తా అని తెలిపిన యువతి, వీడియో కాల్‌లో నగ్నంగా మారేలా యువకుడిని రెచ్చగొట్టింది. తర్వాత యూనిఫాం దరించిన వ్యక్తి తనకు తాను పోలీస్‌ అధికారి విక్రం గోస్వామి అని పరిచయం చేసుకున్నాడు. అమ్మాయితో అసభ్యకరంగా వీడియోకాల్‌ చేశావని, దీనిపై కేసు నమోదైందని చెప్పాడు. వీడియో చూపిస్తూ సోషల్‌ మీడియాలో వైరల్‌ చేసి పరువు తీస్తానని బెదిరించాడు. ఇలా చేయకుండా ఉండాలంటే డబ్బు ఇవ్వాలంటూ పలుమార్లు డబ్బు బదిలీ చేయించుకున్నాడు. కేసు ముగిసిన తర్వాత రీఫండ్‌ అవుతాయని మరికొంతవసూలు చేశాడు. అంతేకాకుండా బాధితుడి బ్యాంకు ఖాతాల వివరాలు తీసుకొని అందులో ఉన్న డబ్బు సైతం కాజేశారు. వీడియో కాల్‌ మాట్లాడిన యువతి చనిపోయిందని, ఇంకా డబ్బు చెల్లించాలని డిమాండ్‌ చేయడంతో బాధితుడు సైబర్‌ క్రైం అధికారులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :