Saturday, 18 April 2026 06:50:51 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

యూట్యూబ్ లో చూసి అత్త హత్య 'దొంగ పోలీస్' ఆటతో కోడలి దారుణం

చాదస్తం భరించలేక అత్తను హత్య చేసిన కోడలు హత్య కోసం యూట్యూబ్‌లో వీడియోలు చూసిన నిందితురాలు

Date : 09 November 2025 09:07 AM Views : 183

Abhi9 News - క్రైమ్ వార్తలు / విశాఖపట్నం : అత్త చాదస్తం, సూటిపోటి మాటలతో విసిగిపోయిన ఓ కోడలు అత్యంత దారుణానికి ఒడిగట్టింది. ఆమెను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం యూట్యూబ్‌లో హత్యలు చేసే పద్ధతులను చూసి, పక్కా ప్రణాళికతో అత్తను సజీవదహనం చేసింది. ఈ ఘోరాన్ని ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించినా, పోలీసుల దర్యాప్తులో అసలు నిజం బయటపడింది. విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో జరిగిన ఈ దారుణ ఘటనలో నిందితురాలైన కోడలిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. పెందుర్తి మండలం వేపగుంట అప్పన్నపాలెంలోని వర్షిణి అపార్టుమెంట్‌లో జయంతి సుబ్రహ్మణ్యం తన తల్లి కనకమహాలక్ష్మి (63), భార్య లలితాదేవి (30), ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తున్నారు. శుక్రవారం రాత్రి సుబ్రహ్మణ్యం పౌరోహిత్యం కోసం బయటకు వెళ్లిన సమయంలో లలితాదేవి తన పథకాన్ని అమలు చేసింది. పిల్లలతో 'దొంగా పోలీస్' ఆట ఆడుదామని అత్త కనకమహాలక్ష్మిని నమ్మించింది. ఆటలో భాగంగా, వాలుకుర్చీలో కూర్చున్న అత్త కళ్లకు చున్నీతో గంతలు కట్టి, చేతులు, కాళ్లను తాళ్లతో బంధించింది. అనంతరం, ముందుగా కొని దాచిపెట్టిన పెట్రోల్‌ను ఆమెపై పోసి నిప్పంటించింది. మంటల్లో చిక్కుకుని కనకమహాలక్ష్మి అక్కడికక్కడే సజీవదహనమయింది. నానమ్మ అరుపులు విని పరుగెత్తుకొచ్చిన కుమార్తె శ్రీనయనకు కూడా మంటలు అంటుకుని గాయాలయ్యాయి. ఈ ఘోరాన్ని కప్పిపుచ్చేందుకు లలితాదేవి నాటకమాడింది. ఇంట్లో టీవీ పేలి ప్రమాదం జరిగిందంటూ గట్టిగా అరుస్తూ ఇరుగుపొరుగు వారిని పిలిచింది. వారు వచ్చి చూసి అగ్నిప్రమాదంగానే భావించారు. అయితే, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఫ్లాట్‌లో పెట్రోల్ వాసన రావడంతో అనుమానించారు. హత్య కోణంలో దర్యాప్తు ప్రారంభించి లలితాదేవి సెల్‌ఫోన్‌ను పరిశీలించారు. ఆమె యూట్యూబ్ హిస్టరీలో 'హత్య చేసి తప్పించుకోవడం ఎలా?' వంటి వీడియోలు ఉండటాన్ని గుర్తించారు. అదే సమయంలో, భర్త సుబ్రహ్మణ్యం కూడా తన భార్య ప్రవర్తనపై పోలీసుల వద్ద అనుమానం వ్యక్తం చేశాడు. దీంతో పోలీసులు లలితాదేవిని తమదైన శైలిలో విచారించగా, ఆమె నేరాన్ని అంగీకరించింది. అత్త చాదస్తంతో, సూటిపోటి మాటలతో వేధిస్తుండటంతోనే ఈ దారుణానికి పాల్పడినట్లు ఒప్పుకుంది. మృతురాలి కుమారుడు సుబ్రహ్మణ్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితురాలిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :