Saturday, 13 June 2026 05:00:00 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

అలా ఎలా మోసపోయావ్ పోలీసన్న..

అతనో పోలీస్.. మళ్లీ ఏఎస్ఐ.. ఆయనకు అన్నీ తెలుసు.. సైబర్ క్రైం గురించి అవగాహన కూడా ఉంది.. మోసాల గురించి తరచూ చెబుతుంటారు.. కానీ.. ఆయనే మోసపోయి లబోదిబోమం

Date : 30 October 2025 02:14 PM Views : 247

Abhi9 News - క్రైమ్ వార్తలు / విజయనగరం : అతనో పోలీస్.. మళ్లీ ఏఎస్ఐ.. ఆయనకు అన్నీ తెలుసు.. సైబర్ క్రైం గురించి అవగాహన కూడా ఉంది.. మోసాల గురించి తరచూ చెబుతుంటారు.. కానీ.. ఆయనే మోసపోయి లబోదిబోమంటున్నారు. పోలీసులు దొంగలకు చుక్కలు చూపిస్తుంటే.. సైబర్ క్రిమినల్స్ పోలీసులకు చుక్కలు చూపించిన ఘటన విజయవాడలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దొంగలకు పట్టుకోవడానికి పోలీసులు ఎన్ని ప్రయత్నాలు.. ఎన్ని వ్యూహాలు రచిస్తారో, ఎన్ని రకాలుగా విచారణ చేసి.. అరెస్టు చేస్తారో మనకు తెలుసు.. కానీ విజయవాడలో మాత్రం ఒక ట్రాఫిక్ఏఎస్ఐకు సైబర్ నేరస్తులు టోకరా వేశారు. వీడియో కాల్ చేసి మరి నమ్మించి నిండా ముంచారు. దీంతో సైబర్ నేరగాళ్లు పంపిన లింక్ ఓపెన్ చేసిన పాపానికి పాపం ఏఎస్ఐ బ్యాంకు అకౌంట్ మొత్తం ఖాళీ అయింది. దీనితో లబోదిబోమంటూ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు సదరు ఏఎస్ఐ.. వివరాల ప్రకారం.. విజయవాడలో ఒక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్‌గా పని చేస్తున్న అధికారికి సైబర్ నేరగాళ్లు క్రెడిట్ కార్డు అప్రూవ్ అయిందని 9666688738 అనే నంబర్ నుంచి ఫోన్ చేశారు. ఇక ఇది నిజమేనని నమ్మిన సదరు ఏఎస్ఐ తన మొబైల్ ఫోన్‌ వాట్సప్‌లో 9038715125 నంబర్ నుంచి HDFC బ్యాంకు క్రెడిట్ కార్డ్ లింక్ పేరుతో నుంచి వచ్చిన లింక్ క్లిక్ చేశారు.. అలా క్లిక్ చేసిన కాసేపటికే.. అకౌంట్ మొత్తం ఖాళీ అయ్యింది. లక్షల్లో డబ్బు పొగొట్టుకున్నట్లు చెబుతున్నారు. దీనితో మోసపోయానని గ్రహించిన ట్రాఫిక్ ఏఎస్ఐ.. సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.. అయితే అందరికీ శకునం చెప్పే బల్లి కుడితిలో పడినట్లు.. దొంగల చేతిలో పోలీసు అధికారి మోసపోవడం కలకలం రేపింది.. సైబర్ నేరగాళ్ల వలకు చిక్కొద్దని ఒకవైపు విస్తృత స్థాయిలో అవగాహన కల్పిస్తుంటే.. పోలీసులే సైబర్ క్రైమ్ బాధితులుగా మారడం స్థానికంగా సంచలనంగా మారింది.. ప్రస్తుతం ఈ ఘటనపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :