Abhi9 News - క్రైమ్ వార్తలు / నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ మండలం వెంకటాపురం (కోటాల గడ్డ) సమీపంలో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని నాగర్ కర్నూల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బాధితుడి తల పగిలి రక్తం ఏరులై పారి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనకు స్థలానికి చేరుకుని వివరాలను సేకరిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Admin
Abhi9 News