Saturday, 18 April 2026 06:42:58 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

అరేయ్.. అలా ఎలారా..? ఎస్సై ఫొటో పెట్టుకుని ఫోన్ చేశాడు..

Date : 11 December 2025 08:12 PM Views : 232

Abhi9 News - క్రైమ్ వార్తలు / Hyderabad : సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు.. ఏకంగా పోలీస్ అధికారుల పేరుతో మెసేజ్ చేసి డబ్బులు దండుకున్నారు. మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్‌కు చెందిన సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా మాట్లాడుతున్నట్లు నటించిన ఓ కేటుగాడు, బోగారం ప్రాంతంలో ఉన్న ఓ పెట్రోల్ బంక్ మేనేజర్ హనుమంతును లక్ష్యంగా తీసుకొని చాకచక్యంగా వల వేసాడు. ‘‘కీసర ఇన్‌స్పెక్టర్‌కు అత్యవసరంగా ఆన్లైన్ ద్వారా డబ్బులు ఇవ్వాల్సి ఉందని, త్వరలోనే బంక్ వద్దకు వ్యక్తిని పంపుతానని’’ చెప్పి హనుమంతును నమ్మించాడు. వాట్సప్‌లో తన డీపీని పోలీస్ యూనిఫాం ఫొటో పెట్టడం, ట్రూ కాలర్‌లో ‘CI’గా కనిపించేలా సెట్టింగ్ చేయడం వల్ల మేనేజర్‌కు ఎలాంటి అనుమానం రాలేదు. ఒత్తిడి పెంచిన ఆ మోసగాడు పంపిన స్కానర్ కోడ్‌కు హనుమంతు వెంటనే 20,000 రూపాయలు సెండ్ చేశాడు.. అయితే డబ్బులు పంపిన తర్వాత కూడా ఎవరూ బంక్‌కు రాకపోవడంతో హనుమంతుకు సందేహాలు మొదలయ్యాయి. నిన్న సాయంత్రం వరకు వేచి చూసిన అనంతరం చివరకు తాను సైబర్ నేరగాళ్ల వలలో పడ్డాననే వాస్తవం తెలుసుకున్నాడు. వెంటనే కీసర పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు అకౌంట్ నెంబర్ ఆధారంగా నిందితున్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.. ఇటీవల కొన్ని రోజులుగా పోలీసుల పేరుతో, ట్రూ కాలర్ ఐడీలను మార్చి.. కేటుగాళ్లు డబ్బులు దండుకోవడం పరిపాటిగా మారింది. అయితే.. ఇలాంటి మోసాలపై నగర పోలీస్ అధికారులు ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు అకౌంట్ నెంబర్ ఆధారంగా నిందితున్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.. ఇటీవల కొన్ని రోజులుగా పోలీసుల పేరుతో, ట్రూ కాలర్ ఐడీలను మార్చి.. కేటుగాళ్లు డబ్బులు దండుకోవడం పరిపాటిగా మారింది. అయితే.. ఇలాంటి మోసాలపై నగర పోలీస్ అధికారులు ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఘటన నేపథ్యంలో పోలీసులు ప్రజలకు మరోసారి హెచ్చరిక జారీ చేస్తూ, ఏ అధికారీ అయినా ఫోన్ ద్వారా డబ్బులు అడిగే పరిస్థితి అసలు ఉండదని స్పష్టం చేశారు. ట్రూ కాలర్‌లో కనిపించే పేరు, వాట్సప్ డీపీలు నమ్మదగిన ఆధారాలు కాదని, ఇవి కేటుగాళ్లు సులభంగా మార్చుకునే అవకాశం ఉన్నందున అలాంటి కాల్స్‌కు ఎవ్వరూ భయానికి లోనుకావొద్దని సూచించారు. అనుమానాస్పద కాల్స్ వచ్చిన వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్‌కు నేరుగా వెళ్లి ధృవీకరించుకోవాలని, మోసానికి గురైన వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు కాల్ చేసి డబ్బులు రికవర్ చేసుకునే అవకాశం పెరుగుతుందని పోలీసులు వివరించారు. ఇటువంటి మోసాలపై సిటీ పోలీస్ ప్రత్యేక దర్యాప్తును వేగవంతం చేస్తోంది.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :