Saturday, 18 April 2026 06:47:28 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

ఛీ.. ఛీ నువ్వేం తల్లివమ్మా..

ప్రియుడి కోసం ఈమె ఏం చేసిందో తెలిస్తే.. రక్తం మరిగిపోద్ది

Date : 18 September 2025 08:20 PM Views : 193

Abhi9 News - క్రైమ్ వార్తలు / : ప్రియుడితో జీవనం సాగించడానికి అడ్డంగా ఉందనే కారణంతో ఒక మహిళ తన మూడెళ్ల కుమార్తెనే కడతేర్చిన ఘటన రాజస్థాన్‌లో వెలుగు చూసింది. ఈ ఘటనను మొదట మిస్సింగ్‌ కేసుగా పరిగణించిన పోలీసులు, సీసీ టీవీ కెమెరాలను పరిశీలించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో తల్లే తన కుమార్తెను హత్య చేసినట్టు గుర్తించిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి చెందిన 28 ఏళ్ల మహిళ కొన్నాళ్ల క్రితం వివాహం జరిగింది. ఈమెకు ప్రస్తుతం మూడేళ్ల కుమార్తె కూడా ఉంది. అయితే కొన్ని రోజుల క్రితం ఈమె తన భర్త నుంచి విడిపోయి రాజస్థాన్‌లోని అజ్మీర్‌కు చెందిన వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీంతో అక్కడికే వెళ్లి ఒక ఒక హోటల్‌లో రిసెప్షనిస్ట్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తుంది. అయితే తన కుమార్తే తమ సంబంధానికి అడ్డుగా ఉందని, ఆమె విషయంతో ప్రియుడి ఆ మహిళతో పదే పదే గొడవ పెట్టుకోవడంతో స్టార్ట్ చేశాడు. దీంతో ఆ మహిళ ఏ తల్లి తీసుకోని నిర్ణయం తీసుకుంది. తన ప్రియుడి కోసం ఏకంగా తన కుమార్తెనే వదిలించుకోవాలని డిసైడ్‌ అయ్యింది. ఇక ప్లాన్‌ ప్రకారం రాత్రి సమయంలో చిన్నారిని తీసుకొని నగరంలోని అనా సాగర్ సరస్సు వైపు వెళ్లింది. ఎవరూ చూడట్లేదని గమనించి ఆ చిన్నారిని సరస్సులొ తోసేసింది. దీంతో చిన్నారి నీటమునిగి ప్రాణాలు కోల్పోయింది. అయితే అదే సమయంలో అటుగా పెట్రోలింగ్ కోసం వచ్చిన ఒక కానిస్టేబుల్‌ అక్కడున్న మహిళ, ఆమె ప్రియుడిని గమనించాడు. ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నారని వారిని ప్రశ్నించాడు. తాము కూతురితో పాటు బయటకు వచ్చామని.. కానీ మధ్యతో తన కూతురు ఎక్కడో తప్పిపోయిందని ఆమె చెప్పుకొచ్చింది. చిన్నారి కోసం చాలా సేపట్నుంచి వెతుకుతున్నట్టు తెలిపింది. దీంతో స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు.. మొదటి ఆమె బాలికతో పాటు నడుకుంటూ తిరుగుతున్నట్టు గుర్తించారు. కానీ కాసేపటి తర్వాత ఆమె పక్కను బాలిక కనిపించలేదు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆమెను తమదైన స్టైల్‌లో నిలదీయడంతో ఆ మహిళ అసలు విషయాన్ని ఒప్పుకుంది. తన కుమార్తెను తానే సరస్సులో తోసి చంపేసినట్టు నేరాన్ని అంగీకరించింది. దీంతో ఉదయం సరస్సులోంచి బాలిక మృతదేమాన్ని బయటకు తీసిన పోలీసులు పోస్ట్‌మాస్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. తర్వాత నిందితురాలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి రద్యాప్తు చేస్తున్నారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :