Thursday, 08 January 2026 02:38:16 AM
# పాలమూరు : తెలంగాణలో టాప్-5.. మనోళ్లే..! # అంతా పక్కాగా మేనేజ్ చేసిన నకిలీ ఐఏఎస్! ఒకే ఒక మిస్టేక్‌తో.. # మక్తల్.. వాహనం ఢీకొని యువకుడి మృతి..! # ఆమెకు 28.. అతనికి 23.. ఇద్దరూ కలిసి చున్నీతో చంపేశారు.. # మావోయిస్ట్‌ పార్టీకి బిగ్‌షాక్.. లొంగుబాటుకు సద్దమైన హిడ్మా క్లోజ్ ఫ్రెండ్! # ప్రాణం తీసిన చిట్టి వ్యాపారం.. డబ్బులు అడిగినందుకు కొట్టి చంపిన తండ్రి, కొడుకులు..! # నర్సింగ్ విద్యార్థినిపై డాక్టర్ అత్యాచారం.. # రోడ్డు ప్రమాదాలకు కారణాలు ఇవే: నారాయణపేట్ ఎస్పీ # క్లీనెస్ట్ సిటీ.. కలుషిత నీటితో 10 మంది మృతి # మైనర్ బాలికను చిదిమేసిన నరరూప రాక్షసులు.. ఏడాదిన్నర తరువాత వెలుగులోకి..! # నిరుద్యోగులకు న్యూయర్ కానుక.. త్వరలోనే 14వేల కానిస్టేబుల్‌ పోస్టులకు నోటిఫికేషన్! # డిగ్రీ విద్యార్థిని చితకబాదిన వార్డెన్‌పై సస్పెన్షన్‌ వేటు.. # మరో బస్సు ప్రమాదం.. స్పాట్‌లో నలుగురు మృతి, 10 మందికి గాయాలు # ఒక పెళ్లి.. 3 సూసైడ్స్..! సినిమాను మించి ట్విస్టులు # ఎర్నాకులం ఎక్స్ ప్రెస్‌ రైలులో మంటలు.. 2 బోగీలు పూర్తిగా దగ్ధం # విభాగ్ స్థాయి ఖేల్ కూద్ లో ప్రతిభ కనబరచిన శ్రీ సరస్వతి శిశు మందిర్ ఊట్కూర్ విద్యార్థులు # ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు మృతి.. # పోలీసులకు సవాల్‌గా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ బత్తుల ప్రభాకర్ # ఘోర బస్సు ప్రమాదం.. 20 మంది సజీవ దహనం # ఖాకీ ముసుగులో కామాంధుడు.. ఏకంగా ఇన్‌స్పెక్టర్ ఇంట్లోనే..

డ్రగ్స్ నీ నివారించడానికి విద్యార్థులే సైనికుల్లా ముందుకు రావాలి

జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ ఐపిఎస్.. జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్

Date : 18 September 2025 07:11 PM Views : 70

Abhi9 News - క్రైమ్ వార్తలు / Hyderabad : మత్తు కు కాదు… భవిష్యత్తుకే ప్రాధాన్యం ఇవ్వాలి, గ్రామీణ ప్రాంతాలకూ విస్తరిస్తున్న డ్రగ్స్‌ ప్రభావం, 100, 112 కి సమాచారం ఇవ్వండి,రహస్యంగా ఉంచుతాం, “యువతే దేశ భవిష్యత్తు,మత్తు పదార్థాలకు ‘నో’ చెప్పండి, డ్రగ్స్‌ రహిత సమాజం నిర్మాణమే లక్ష్యం,విద్యార్థులు మత్తుకు కాదు, భవిష్యత్తుకే ప్రాధాన్యతా ఇవ్వాలని, జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ జిల్లా కలెక్టర్ తో కలిసి, యువతకు పిలుపునిచ్చారు. నెల్లికొండ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో గురువారం జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఆధ్వర్యంలో డ్రగ్స్ దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమం జరిగింది. కళాశాల విద్యార్థులతో జరిగిన ఈ సమావేశంలో అధికారులు డ్రగ్స్ వాడకం వల్ల కలిగే మానసిక, శారీరక, సామాజిక ప్రభావాలపై విశ్లేషణాత్మకంగా వివరించారు. జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ మాట్లాడుతూ విద్యార్థులు మత్తు పదార్థాలకు లోనుకాకుండా తమ భవిష్యత్తుపై దృష్టి పెట్టాలని సూచించారు. డ్రగ్స్ వాడకం చదువుపై ప్రతికూల ప్రభావం చూపడంతో పాటు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని నాశనం చేస్తుందని, వ్యసనానికి లోనైన వారు నేరాలకు పాల్పడే అవకాశం పెరుగుతుందని ఆయన హెచ్చరించారు. ఒకప్పుడు డ్రగ్స్ ప్రభావం ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో మాత్రమే ఉండేది, అయితే ఇప్పుడు అది గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించడం ఆందోళన కలిగించే అంశమని కలెక్టర్ అన్నారు. గ్రామీణ ప్రాంతాల సంస్కృతి, సాంప్రదాయాలు కూడా దీనివల్ల దెబ్బతినే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు తమ జీవిత లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకొని క్రమశిక్షణతో చదువుకుంటూ ముందుకు సాగాలని, నా జీవిత ఉన్నతి, నా కుటుంబ బాధ్యత — ఇవే నాకు ముఖ్యమని, డ్రగ్స్‌ కి నా జీవితంలో స్థానం లేదు అనే సంకల్పంతో ఉండాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ సూచించారు. డ్రగ్స్ రహిత జిల్లాను నిర్మించడంలో విద్యార్థులే సైనికుల్లా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ మాట్లాడుతూ.. డ్రగ్స్ రవాణా, వాడకం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై పోలీస్ శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. విద్యార్థులు అనుమానాస్పద వ్యక్తులు లేదా ఘటనల గురించి నిర్భయంగా పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. 100 లేదా 112 నంబర్ ద్వారా సమాచారం ఇవ్వవచ్చని, ఇచ్చే సమాచారాన్ని రహస్యంగా ఉంచుతామని ఆయన హామీ ఇచ్చారు. విద్యార్థులు సమాజాన్ని మార్చగల శక్తి కలవారని, డ్రగ్స్ అనే అనర్థాన్ని తిప్పికొట్టడంలో వారు ముఖ్య పాత్ర పోషించాలన్నారు. విద్యార్థులు దేశ భవిష్యత్తు, ఆరోగ్యంగా, సుస్థిర ఆలోచనలతో ఎదగాలి. డ్రగ్స్ అనే అగ్ని నుంచి మీరే మిమ్మల్ని రక్షించుకోవాలి. పోలీసులు మీతో ఉన్నారు, ధైర్యంగా ముందుకు రండి అని స్పష్టం చేశారు. అనంతరం డ్రగ్స్ రహిత అవగాహన గొడవ పత్రికను ఆవిష్కరించారు, రాష్ట్రస్థాయిలో నిర్వహించిన డ్రగ్స్ రహితపై చిత్రలేఖన పోటీల్లో ఉత్తమ ప్రతిభ సాధించిన ఇద్దరు విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ మదన్ మోహన్, నాగర్ కర్నూల్ డిఎస్పి బుర్రి శ్రీనివాసులు, సీనియర్ లెక్చరర్లు అకాడమిక్ మానిటరింగ్ కోఆర్డినేటర్ అంజయ్య, కళాశాల యాంటీ డ్రగ్ కోఆర్డినేటర్ వనిత, నాగర్ కర్నూల్ సిఐ అశోక్ రెడ్డి, ఎస్ఐ గోవర్ధన్, కళాశాల అధ్యాపక బృందం విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :