Saturday, 18 April 2026 06:50:10 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

ప్రాణం తీసిన వివాహేతర బంధం

ప్రియుడి ఇంట్లో వివాహిత ఆత్మహత్య.. పరువు పోతుందనే భయంతో అతడు ఏం చేశాడంటే

Date : 23 September 2025 07:40 PM Views : 236

Abhi9 News - క్రైమ్ వార్తలు / Hyderabad : వివాహేతర సంబంధాలు మంచివి కాదని పోలీసులు నెత్తీ నోరు బాదుకుంటున్నారు. వివాహేతర సంబంధాలు కాపురాల్లో చిచ్చు రేపుతున్నాయి. అనుమానంతో భార్యను భర్త.. భర్తను భార్య చంపుకుంటున్నారు. వివాహేతర బంధాలు ప్రాణాలు తీస్తున్నాయి. ఇటువంటి బంధాలు మంచివి కాదని, అనర్థాలకు దారితీస్తాయని పోలీసులు హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినా కొందరిలో మార్పు రావడం లేదు. పరాయి వ్యక్తి మోజులో పడి కాపురాలు నాశనం చేసుకుంటున్నారు. ఈ బంధం బయటపడుతుందనే భయంతో ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ లో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం ఓ మహిళ ప్రాణం తీసింది. ప్రియుడి ఇంట్లో వివాహిత ఉరివేసుకుంది. హైదరాబాద్ నాగోల్ పరిధిలో నివాసం ఉంటున్న బానోత్ అనిల్ నాయక్ (24) కు మహబూబాబాద్ జిల్లా రెడ్యాల గ్రామానికి చెందిన మహిళ (38)తో పరిచయం ఏర్పడింది. ఇది వివాహేతర సంబంధానికి దారితీసింది. అనిల్ తో గడిపేందుకు మహిళ మహబూబాబాద్ జిల్లా రెడ్యాల గ్రామం నుంచి నాగోల్ వచ్చింది. తన కుమారుడి(3)కి చికిత్స చేయిస్తానని ఇంట్లో చెప్పి ఆమె హైదరాబాద్ వచ్చింది. నాగోల్ లోని అనిల్ ఇంటికి వెళ్లింది. అక్కడే రెండు రోజులు ఉంది. కాగా, కూరగాయలు తెచ్చేందుకు అనిల్ బయటకు వెళ్లాడు. తిరిగి ఇంటికి వచ్చాడు. అతడు ఇంటికి తిరిగి వచ్చేసరికి బాత్రూమ్ లో హ్యాంగర్‌కు చీరతో ఉరివేసుకుంటూ మహిళ కనిపించింది. అది చూసి అనిల్ షాక్ అయ్యాడు. సాయం కోసం చుట్టుపక్కల వారిని పిలిస్తే.. మహిళ తన ఇంట్లో ఉందని తెలిస్తే.. తన పరువు పోతుందని అనిల్ భయపడ్డాడు. సాయం కోసం ఎవరినీ పిలవలేదు. తానే తలుపు బద్దలు కొట్టి లోపలికి వెళ్లేసరికి మహిళ తుదిశ్వాస విడిచింది. దీంతో అనిల్ బాగా భయపడిపోయాడు. ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు. చేయి కోసుకున్నాడు. అయితే, అతడికి ఎదురుగా ఏడుస్తున్న మూడేళ్ల చిన్నారిని చూశాడు. దీంతో చలించిపోయాడు. వెంటనే చేతికి క్లాత్ కట్టుకున్నాడు. నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఇంతలో ఈ విషయం మహిళ కుటుంబసభ్యులకు తెలిసింది. వారు నాగోల్ చేరుకున్నారు. అనిల్‌ను కఠినంగా శిక్షించాలని మృతురాలి బంధువులు, కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ప్రియుడి ఇంట్లో వివాహిత ఆత్మహత్య ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. అసలేం జరిగింది? ఆ మహిళ ఎందుకు ఆత్మహత్య చేసుకుంది? ఈ మిస్టరీని చేధించే పనిలో పోలీసులు ఉన్నారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :