Saturday, 18 April 2026 06:45:15 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

రూ.4కోట్ల వాచ్ ఆర్డర్.. వచ్చింది ఇదా..

Date : 23 October 2025 03:28 PM Views : 192

Abhi9 News - క్రైమ్ వార్తలు / : ఆన్‌లైన్‌లో వాచ్‌ ఆర్డర్ చేసిన చెన్నైకి చెందిన ఒక వ్యక్తికి ఊహించని పరిణామం ఎదురైంది. తను ఆర్డర్ చేసిన వాచ్‌ డెలివరీ తీసుకునేందుకు వెళ్లిన అతను డెలివరీలో వచ్చిన దాన్ని చూసి కంగుతిన్నాడు. వివరాల్లోకి వెళ్తే.. చెన్నైకి చెందిన ఓ ప్రముఖ బట్టల వ్యాపారి కుమారుడు ఇటీవల ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో రూ.4 కోట్ల విలువైన వాచ్‌ను చూసి మనసుపారేసుకున్నాడు. దాన్ని ఎలాగైనా కొనాలని నిర్ణయించుకొని. స్థానికంగా ఉన్న ఒక ఏజెంట్‌ను సంప్రదించాడు. అతని ద్వారా వాచ్‌ కొనేందుకు అతని ముందుగా ఆన్‌లైన్‌లో రూ.2.3 కోట్లు చెల్లించాడు. అయితే మంగళవారం తను చేసిన ఆర్డర్ వచ్చినట్టు అతనికి కాల్ వచ్చింది. దీంతో ఆర్డర్ తీసుకునేందుకు ఆతను ఎంతో ఆశగా, ఆత్రుగా బయల్దేరాడు. డెలివరీ బాయ్ నుంచి ఆర్డర్ తీసుకున్నాడు. వెంటనే దాన్ని విప్పి చూశాడు. అందులో తును ఆర్డర్ చేసిన రూ.4 కోట్ల విలువైన వాచ్‌కు బదులుగా కేవలం రూ.400 విలువైన చౌకబారు వాచ్ ఉండటాన్ని చూసి ఒక్కసారిగా కంగుతిన్నాడు. తాను మోసపోయానని గ్రహించి వెంటనే స్థానిక పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. తన దగ్గర నుంచి డబ్బులు తీసుకున్న ఏజెంట్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అడ్వాన్స్‌గా చెల్లించిన రూ. 2.30 కోట్లు తిరిగి ఇప్పించాలని బాధితుడు పోలీసులను కోరాడు. బాధితుడి ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చుసుకున్న కొట్టూరుపురం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఫిర్యాదును సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు విచారణ కోసం పంపనున్నట్లు పోలీసు వర్గాల్లో సమాచారం అందింది.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :