Saturday, 18 April 2026 05:19:27 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

నిండు గర్భిణిని గొడ్డలితో నరికి చంపిన మామ.. కులాంతర వివాహమే కారణం!

ప్రేమ వివాహం చేసుకున్న కుమారుడిపై మామ ఆగ్రహం

Date : 18 October 2025 06:45 PM Views : 203

Abhi9 News - క్రైమ్ వార్తలు / కుమురం భీమ్ : కులం పట్టింపు ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. కడుపులో బిడ్డను మోస్తున్నదని కూడా చూడకుండా కోడలిని ఓ కసాయి మామ గొడ్డలితో నరికి చంపిన అమానవీయ ఘటన కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. కొడుకు తమ కులం కాని అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకోవడాన్ని సహించలేక ఈ దారుణానికి ఒడిగట్టాడు. దహెగాం మండలం గెర్రె గ్రామానికి చెందిన శేఖర్ (బీసీ కులం) అదే గ్రామానికి చెందిన రాణి (ఎస్టీ కులం) అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరి వివాహం శేఖర్ తండ్రి సత్తయ్యకు ఏమాత్రం ఇష్టం లేదు. కులాంతర వివాహం చేసుకోవడంపై కుమారుడిపై, కోడలిపై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నాడు. ఇదిలా ఉండగా, రాణి గర్భం దాల్చింది. ప్రస్తుతం ఆమె ఎనిమిది నెలల నిండు గర్భిణి. త్వరలో తమ కుటుంబంలోకి కొత్త బిడ్డ రాబోతోందన్న ఆనందంలో శేఖర్, రాణి దంపతులు ఉన్నారు. వారి సంతోషాన్ని చూసి ఓర్వలేకపోయిన సత్తయ్య, కిరాతకంగా ప్రవర్తించాడు. గర్భిణి అని కూడా కనికరం లేకుండా కోడలు రాణిపై గొడ్డలితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రాణి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితుడు సత్తయ్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :