Saturday, 18 April 2026 06:43:25 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

ఐటీ కమిషనర్‌కే టోకరా.. రెప్పపాటులో బ్యాంక్‌ బ్యాలెన్స్‌ మాయం!

ఆన్‌లైన్ మోసాలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. సాధారణ ప్రజలు మాత్రమే కాదు. ఉన్నతాధికారులు కూడా ఇప్పుడు సైబర్ దుండగుల బారిన పడుతున్నారు. తాజాగా హైదరాబా

Date : 16 November 2025 06:18 PM Views : 205

Abhi9 News - క్రైమ్ వార్తలు / Hyderabad : ఆన్‌లైన్ మోసాలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. సాధారణ ప్రజలు మాత్రమే కాదు. ఉన్నతాధికారులు కూడా ఇప్పుడు సైబర్ దుండగుల బారిన పడుతున్నారు. తాజాగా హైదరాబాదులో ఓ ఇన్‌కమ్ టాక్స్ కమిషనర్‌నే కేటుగాళ్లు బురిడి కొట్టించిన ఘటన చోటు చేసుకుంది. ఇంటికోసం ఆన్‌లైన్‌లో లిక్కర్ ఆర్డర్ చేసిన కమిషనర్ డబ్బులు చెల్లించే క్రమంలో సైబర్ నేరస్థులు అతడిని మోసం చేశారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉన్నట్టుగా చూపిస్తూ ‘jubliehillswinespot.in’ అనే నకిలీ వెబ్‌సైట్‌ను కేటుగాళ్లు రూపొందించినట్లు సైబర్ క్రైమ్ విచారణలో బయటపడింది. హోమ్ డెలివరీ కూడా చేస్తామని ప్రత్యేకంగా హైలైట్ చేసిన ఆ వెబ్‌సైట్‌ను నిజమైనదిగా భావించిన ఐటీ కమిషనర్, అక్కడి నుంచి వైన్ ఆర్డర్ చేశారు. ఆర్డర్ సమయంలోనే వెబ్‌సైట్ గూగుల్ పే ద్వారా ముందస్తు చెల్లింపు కోరింది. హోమ్ డెలివరీతో వస్తుందని నమ్మి కమిషనర్ వెంటనే రూ. 2320 గూగుల్ పే ద్వారా చెల్లించారు. కొద్ది నిమిషాల్లోనే ‘డెలివరీ కన్ఫర్మ్ చేసేందుకు మరొక స్కానర్ పంపుతున్నాం’ అంటూ కేటుగాళ్లు వాట్సాప్ ద్వారా ఒక QR కోడ్ పంపారు. దీన్ని స్కాన్ చేస్తే పేమెంట్ వెరిఫై అవుతుందని, అప్పుడు మాత్రమే డెలివరీ ప్రారంభమవుతుందని చెప్పారు. అనుమానించకుండా కమిషనర్ ఆ కోడ్‌ను స్కాన్ చేశారు. అదే క్షణం కమిషనర్‌ ఫోన్‌కు రూ. 40,000 డెబిట్ అయ్యిందని బ్యాంక్ నుంచి మెసేజ్ వచ్చింది. అంత పెద్ద మొత్తంలో డబ్బు మైనస్ అయిన మెసేజ్ చూసిన కమిషనర్ ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. వెంటనే ఆ QR కోడ్ స్కాన్ చేసిందే తన పొరపాటు అని గ్రహించారు. కేటుగాళ్లు చెల్లింపును వెరిఫికేషన్ పేరిట మళ్లీ తమ ఖాతాకు మళ్లించేలా మోసపూరిత QR కోడ్‌ను రూపొందించినట్లు స్పష్టమైంది. డబ్బు పోయిన సంగతి అర్థమైన వెంటనే ఐటీ కమిషనర్ వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మోసగాళ్ల వివరాలు, వెబ్‌సైట్ స్క్రీన్‌షాట్స్, వాట్సాప్ చాట్స్ అన్నీ పోలీసులకు అందజేశారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :