Thursday, 08 January 2026 02:45:30 AM
# పాలమూరు : తెలంగాణలో టాప్-5.. మనోళ్లే..! # అంతా పక్కాగా మేనేజ్ చేసిన నకిలీ ఐఏఎస్! ఒకే ఒక మిస్టేక్‌తో.. # మక్తల్.. వాహనం ఢీకొని యువకుడి మృతి..! # ఆమెకు 28.. అతనికి 23.. ఇద్దరూ కలిసి చున్నీతో చంపేశారు.. # మావోయిస్ట్‌ పార్టీకి బిగ్‌షాక్.. లొంగుబాటుకు సద్దమైన హిడ్మా క్లోజ్ ఫ్రెండ్! # ప్రాణం తీసిన చిట్టి వ్యాపారం.. డబ్బులు అడిగినందుకు కొట్టి చంపిన తండ్రి, కొడుకులు..! # నర్సింగ్ విద్యార్థినిపై డాక్టర్ అత్యాచారం.. # రోడ్డు ప్రమాదాలకు కారణాలు ఇవే: నారాయణపేట్ ఎస్పీ # క్లీనెస్ట్ సిటీ.. కలుషిత నీటితో 10 మంది మృతి # మైనర్ బాలికను చిదిమేసిన నరరూప రాక్షసులు.. ఏడాదిన్నర తరువాత వెలుగులోకి..! # నిరుద్యోగులకు న్యూయర్ కానుక.. త్వరలోనే 14వేల కానిస్టేబుల్‌ పోస్టులకు నోటిఫికేషన్! # డిగ్రీ విద్యార్థిని చితకబాదిన వార్డెన్‌పై సస్పెన్షన్‌ వేటు.. # మరో బస్సు ప్రమాదం.. స్పాట్‌లో నలుగురు మృతి, 10 మందికి గాయాలు # ఒక పెళ్లి.. 3 సూసైడ్స్..! సినిమాను మించి ట్విస్టులు # ఎర్నాకులం ఎక్స్ ప్రెస్‌ రైలులో మంటలు.. 2 బోగీలు పూర్తిగా దగ్ధం # విభాగ్ స్థాయి ఖేల్ కూద్ లో ప్రతిభ కనబరచిన శ్రీ సరస్వతి శిశు మందిర్ ఊట్కూర్ విద్యార్థులు # ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు మృతి.. # పోలీసులకు సవాల్‌గా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ బత్తుల ప్రభాకర్ # ఘోర బస్సు ప్రమాదం.. 20 మంది సజీవ దహనం # ఖాకీ ముసుగులో కామాంధుడు.. ఏకంగా ఇన్‌స్పెక్టర్ ఇంట్లోనే..

స్కూల్‌కు చెప్పులు వేసుకుని వచ్చిందనీ.. చెంపపై కొట్టిన ప్రిన్సిపాల్‌! విద్యార్థిని మృతి

ఓ విద్యార్ధిని చెప్పులు వేసుకుని స్కూల్‌కి వచ్చింది. గమనించిన ప్రిన్సిపల్‌ అందరి ముందే విద్యార్థిని చెంపపై లాగిపెట్టి కొట్టింది. దీంతో అవమానంగా భావించ

Date : 15 October 2025 09:17 PM Views : 148

Abhi9 News - క్రైమ్ వార్తలు / : ఓ విద్యార్ధిని చెప్పులు వేసుకుని స్కూల్‌కి వచ్చింది. గమనించిన ప్రిన్సిపల్‌ అందరి ముందే విద్యార్థిని చెంపపై లాగిపెట్టి కొట్టింది. దీంతో అవమానంగా భావించిన విద్యార్ధిని డిప్రెషన్‌లోకి వెళ్లి.. సూసైడ్‌ చేసుకుని మృతి చెందింది. బాలిక మరణించడంతో ఆగ్రహించిన ఆమె కుటుంబ సభ్యులు పాఠశాలపై దాడి చేశారు. తమకు న్యాయం చేయాలంటూ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ షాకింగ్‌ ఘటన జార్ఖంగ్‌లో వెలుగు చూసింది. అసలేం జరిగిందంటే.. జార్ఖండ్‌లోని గర్హ్వా జిల్లా బార్‌గఢ్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలోని ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో దివ్య కుమారి అనే బాలిక 12వ తరగతి చదువుతుంది. సెప్టెంబర్ 15న ఆ విద్యార్థిని బూట్లకు బదులుగా చెప్పులు ధరించి స్కూలుకు వచ్చింది. అసెంబ్లీకి అలాగే హాజరైంది. స్కూల్‌ ప్రిన్సిపాల్ (ఇన్‌చార్జ్) ద్రౌపది మింజ్ డ్రెస్‌ కోడ్‌ పాటించనందుకు ఆమెను అందరి ముందు తిట్టింది. అంతేకాకుండా బాలికను చెంపదెబ్బ కొట్టింది. ఈ సంఘటన తర్వాత విద్యార్థిని దివ్య తొలుత బాగానే కనిపించినా.. ఆ తర్వాత ఆమె డిప్రెషన్‌కు గురైంది. ఆమె ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు డాల్టన్‌గంజ్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఆక్కడ దివ్యకు ప్రాథమిక చికిత్స అందించిన ఆ తర్వాత రాంచీలోని రిమ్స్‌కు రిఫర్‌ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ దివ్య అక్టోబర్‌ 14న మరణించింది. విద్యార్థిని దివ్య మరణానికి స్కూల్‌ ప్రిన్సిపాల్ మానసిక వేధింపులు కారణమని ఆమె తల్లిదండ్రులు బార్‌గఢ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆగ్రహించిన బాలిక కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆమె మృతదేహాన్ని తెహ్రీ భండారియా చౌక్ వద్ద ప్రధాన రహదారిపై ఉంచి పాఠశాల యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రిన్సిపల్‌ మానసిక హింస కారణంగానే దివ్య మరణించిందని నిరసనకారులు చేస్తూ, ఆమెను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. 3 గంటలకు పైగా రోడ్డుపై దర్నా చేయడంతో వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు, జిల్లా అధికారులు అక్కడకు చేరుకుని ఆందోళన కారులను సముదాయించి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో విద్యార్థిని మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించారు. ఈ విషయంపై మాట్లాడటానికి ప్రిన్సిపాల్ నిరాకరించారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :