Abhi9 News - జాతీయ వార్తలు / : మహారాష్ట్రలో పుణే - బెంగళూరు జాతీయ రహదారిలోని నవలే వంతెనపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న కంటైనర్ ట్రక్.. ఎదురుగా వస్తున్న వాహనాలను వేగంగా ఢీ కొట్టంది. ఆ వెంటనే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్లున్న వాహనదారులు వెంటనే స్పందించి.. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులతోపాటు అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకు వచ్చారు. అనంతరం క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.
Admin
Abhi9 News