Saturday, 18 April 2026 07:05:35 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

నన్ను క్షమించండి.. రిటైర్ట్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ పశ్చాత్తాపం

Date : 12 November 2025 05:07 PM Views : 196

Abhi9 News - జాతీయ వార్తలు / : రిటైర్ట్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో తాను చేసిన తప్పులకు సారీ చెబుతూ సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేశారు. ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్, ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావుకు బహిరంగ క్షమాపణలు చెప్పారు. సర్వీసులో ఉండగా వారిపట్ల తాను అనుచితంగా ప్రవర్తించానని, అందుకు చింతిస్తున్నానని వీడియోలో పేర్కొన్నారు. గతేడాది సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్‌కు గురయ్యాను. ఏం తప్పు చేశాననే అంశంపై తీవ్రంగా ఆలోచించా.. 30 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్‌లో పనిచేశా.. నా సర్వీస్‌లో ఒక్క రూపాయి కూడా అక్రమంగా సంపాదించలేదు.. చట్టానికి విరుద్ధంగా ఏనాడూ ప్రవర్తించలేదు.. 2000-2004 వరకు గుంటూరు, విజయవాడలో మున్సిపల్ కమిషనర్‌గా పనిచేశా.. గుంటూరు, విజయవాడకు చేసిన సేవలు నన్ను హీరోని చేశాయి, కానీ.. ఒక్క తప్పుతో హీరోగా ఉన్న నేను విలన్‌గా మారిపోయి.. సమాజం పెట్టిన టెస్టులో నేను ఫెయిల్ అయ్యాను. తప్పు చేశాననే భావనతోనే VRSకు అప్లయ్ చేశాను. 2020లో ఏపీ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన సమయంలో.. ఏబీ వెంకటేశ్వరరావుపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డీజీపీ ఆఫీస్ నుంచి ఫైల్ వచ్చింది. నాకంటే ఏబీ వెంకటేశ్వరరావు ఐదేళ్ల సీనియర్ ఆఫీసర్.. డీజీపీ ఆఫీస్ ఫైల్ ప్రకారమే .. ఏబీవీపై చర్యలు తీసుకోవచ్చని చెప్పాను. ఏబీ వెంకటేశ్వరరావు విషయంలో నేను చేసిన తప్పు అర్థమైంది.. ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్ విషయంలోనూ తప్పు జరిగిందంటూ ఏబీ వెంకటేశ్వరరావు, కృష్ణకిషోర్‌కు క్షమాపణలు చెప్పారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :