Saturday, 18 April 2026 07:03:26 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

ఎర్రకోట దగ్గర భారీ పేలుడు.. 8 మంది మృతి

ఎర్రకోట దగ్గర భారీ పేలుడు సంభవించింది. మెట్రో స్టేషన్‌ గేట్‌ నెంబర్‌ 1 దగ్గర పార్కింగ్‌ చేసిన కారులో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ..

Date : 10 November 2025 08:18 PM Views : 257

Abhi9 News - జాతీయ వార్తలు / : ఎర్రకోట దగ్గర భారీ పేలుడు సంభవించింది. మెట్రో స్టేషన్‌ గేట్‌ నెంబర్‌ 1 దగ్గర పార్కింగ్‌ చేసిన కారులో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఐదు కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం అందుతోంది. మరోవైపు పేలుడు కారణంగా పరిసరాల్లో ఉన్న కార్లకు మంటలు అంటుకోగా.. సమీపంలోని పలు దుకాణాలు ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. 7 ఫైరింజన్ల సహాయంతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఫోర్స్, ఫోరెన్సిక్ సిబ్బంది కూడా ఘటనా స్థలికి చేరుకుంది. పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సంఘటన స్థలంలో ఆధారాలను సేకరిస్తున్నారు. పేలుడు జరిగిన ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం సైతం ఈ ఘటనపై రియాక్ట్ అయ్యింది. ఢిల్లీ సహా దేశంలోని ప్రధాన నగరాల్లో హై అలర్ట్ ప్రకటించింది. ఆయా నగరాల్లో సెక్యూరిటీని కట్టుదిట్టం చేసింది. కేంద్రం అలర్ట్‌తో ప్రధాన నగరాల్లో పోలీసులు అప్రమత్తం అయ్యారు. పేలుడుపై స్పందించిన ఢిల్లీ పోలీసులు.. ఉగ్రవాద చర్యలను తోసిపుచ్చలేమంటున్నారు. పేలుడు ఘటనలో 8 మంది చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు. తొలుత 15 మందికి తీవ్ర గాయాలవగా వారిని లోక్ నాయక్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో మార్గం మధ్యలోనే 8 మంది చనిపోయారు. ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని.. మరికొందరి ఆరోగ్యం నిలకడగా ఉందని లోక్‌ నాయక్ మెడికల్ సూపరిండెంట్ లోక్ నాయక్ జయ్ ప్రకాష్ నారాయణ్ తెలిపారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :