Abhi9 News - జాతీయ వార్తలు / : భారతదేశ స్వాతంత్య్ర సమరంలో జాతిని జాగృతం చేసిన ‘వందేమాతరం’ గీతానికి నేటితో 150 ఏళ్లు నిండాయి. ఈ వేడుక సందర్భంగా జాతీయోద్యమ మహనీయులకు దేశ వ్యాప్తంగా ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ సందేశాలు ఇస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయోద్యమ మహనీయులకు ఘన నివాళులర్పించారు. వందేమాతరం.. జాతీయ గీతం స్ఫూర్తిగా, సమైక్యతా భావంతో దేశ అభివృద్ధికి పునరంకితమవుదామని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా నిర్దేశిత సమయంలో ప్రజలందరూ వందేమాతరం ఆలపించాలని గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇవాళ ఉదయం 10 గం. ప్రతి ఒక్కరం వందేమాతర గేయాన్ని ఆలపిద్దాము. వందేమాతరం స్ఫూర్తిని భావి తరాలకు అందించే బాధ్యత మనందరిదీ జైహింద్' అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.
Admin
Abhi9 News