Saturday, 18 April 2026 05:13:50 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

జైలులో ఫోన్లు మాట్లాడుతూ, టీవీలు చూస్తున్న ఖైదీలు!

అత్యాచారం, హత్య కేసుల నిందితుడు కూడా మొబైల్ వినియోగిస్తున్నట్లు వీడియోలు జైలులో వెలుగు చూసిన భద్రతా లోపాలు

Date : 08 November 2025 06:07 PM Views : 186

Abhi9 News - జాతీయ వార్తలు / : కర్ణాటక రాజధాని బెంగళూరులోని పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో ఖైదీలు నిబంధనలకు విరుద్ధంగా సరదాగా గడుపుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఖైదీలు మొబైల్ ఫోన్లు వాడుతున్నారని, టీవీలు చూస్తున్నారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. శిక్షలు పడినప్పటికీ ఖైదీలు కొందరు నిబంధనలకు విరుద్ధంగా గడుపుతున్నట్లు సమాచారం. 1996-2022 మధ్య 20 మంది మహిళలపై అత్యాచారం చేసి, వారిలో 18 మందిని హత్య చేసిన కేసులో దోషిగా తేలిన ఉమేశ్ కు తొలుత కోర్టు మరణశిక్ష విధించింది. అయితే, సుప్రీంకోర్టు దానిని 30 ఏళ్ల కఠిన కారాగార శిక్షగా మార్పు చేసింది. ఇదే జైలులో ఉన్న ఉమేశ్ మొబైల్ ఫోన్‌లో మాట్లాడుతున్న వీడియోలు వెలుగులోకి వచ్చాయి. జైలు లోపల రెండు ఆండ్రాయిడ్ ఫోన్లు, ఒక కీప్యాడ్ మొబైల్‌ను ఉమేశ్ వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. అతడిని ఉంచిన జైలు సెల్‌లో టీవీ కూడా ఉన్నట్లు సమాచారం. నటి రన్యా రావు బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్టైన తరుణ్ రాజు కూడా జైల్లో మొబైల్ ఫోన్ వినియోగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా, అతడిని ఉంచిన సెల్‌లో వంట కూడా చేసుకుంటున్నాడని తెలుస్తోంది. పలువురు ఇతర ఖైదీలు కూడా మొబైల్ ఫోన్లు ఉపయోగిస్తున్నట్లు సమాచారం.వీటికి సంబంధించిన వీడియో క్లిప్స్ వైరల్ కావడంతో జైలులో భద్రతా లోపాలు వెలుగుచూశాయి. ఈ విషయంపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. దీనిపై దర్యాప్తునకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :