Saturday, 18 April 2026 05:19:27 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

డీజీపీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు ముఖ్య నేతలు

Date : 10 October 2025 08:20 PM Views : 205

Abhi9 News - జాతీయ వార్తలు / : డీజీపీ శివధర్‌రెడ్డి ఎదుట మావోయిస్టు ముఖ్య నేతలు లొంగిపోయారు. ఇవాళ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీజీపీ మాట్లాడారు. కుంకటి వెంకటయ్య అలియాస్‌ వికాస్‌, మొగిలిచర్ల వెంకట్రాజు అలియాస్‌ చందు, తోడెం గంగ అలియాస్‌ సోనీ (ఛత్తీస్‌గఢ్‌) మావోయిస్టు పార్టీ నుంచి బయటకు వచ్చి జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నారని తెలిపారు. ముగ్గురు మావోయిస్టు పార్టీలో రాష్ట్ర కమిటీ స్థాయి నాయకులు అన్నారు. సిద్దిపేట జిల్లాకు చెందిన కుంకటి వెంకటయ్య 1990లో పీడబ్ల్యూడీ ఏర్పాటు చేసిన రైతు కూలీ సభలకు హాజరై అదే ఏడాది అజ్ఞాతంలోకి వెళ్లారని చెప్పారు. పిడబ్ల్యూడీ కమాండర్‌ బాలన్న ఆధ్వర్యంలో దళంలో చేరారని తెలిపారు. తర్వాత అంచెలంచెలుగా ఎదిగి 35 ఏళ్లపాటు వివిధ హోదాల్లో పనిచేశారని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన పిలుపును అందుకుని జనజీవన స్రవంతిలో కలవాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. హనుమకొండ జిల్లా ధర్మసాగరం మండలం తాటికాయల గ్రామానికి చెందిన మొగిలిచర్ల వెంకటరాజు (45) 11 ఏళ్ల వయసులోనే విప్లవగీతాలకు ఆకర్షితుడై మావోయిస్టు ఉద్యమంలో చేరారని చెప్పారు. 1993లో నర్సంపేట దళంలో రిక్రూట్‌ అయి రాష్ట్రస్థాయి కమిటీలో వివిధ హోదాల్లో పనిచేశారని తెలిపారు. మావోయిస్టులతో వచ్చిన సైద్ధాంతిక విభేదాల కారణంగా, పోలీసులు ఇచ్చిన పిలుపును అందుకుని అతడి భార్య తోడెం గంగతో కలిసి పోలీసుల ఎదుట లొంగిపోయారని తెలిపారు. ఇటీవల కాలంలో 403 మంది మావోయిస్టులు పోలీసులు ఎదుట లొంగిపోయారని డీజీపీ తెలిపారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :